పర్యాటక ప్రియులకు ఆహ్వానం
● కొండవీడు కోటపై సందర్శన
నిషేధం ఎత్తివేత
● పల్నాడు జిల్లా అటవీశాఖ
అధికారి జి. కృష్ణప్రియ
యడ్లపాడు: చారిత్రక వైభవం ఉట్టిపడే కొండవీడు కోట సందర్శనకు విధించిన తాత్కాలిక నిషేధాన్ని ఎత్తి వేస్తున్నట్లు పల్నాడు జిల్లా అటవీశాఖ అధికారి జి.కృష్ణప్రియ వెల్లడించారు. మోంథా తుఫాన్ నేపథ్యంలో పర్యాటకుల భద్రత దృష్ట్యా కొండవీడు కోట సందర్శనపై గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 4వ తేదీ వరకు తాత్కాలిక నిషేధం అమలులో ఉంది. భారీ వర్షాల కారణంగా కొండ శిఖరాల నుంచి చిన్న, పెద్ద బండరాళ్లు జారి ఘాట్‌రోడ్డుపై పడటంతో సందర్శనకు బ్రేక్ పడింది. అటవీశాఖ సిబ్బంది యుద్ధప్రాతిపదికన ఘాట్‌రోడ్డుపై పడిన వాటిని పూర్తిగా తొలగించారు. దీంతో కొండవీడుకోటపై విధించిన నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేసినట్లు డీఎఫ్‌ఓ ప్రకటించారు. బుధవారం నుంచి పర్యాటక ప్రియులు యథావిధిగా ఈ చారిత్రక ప్రాంతాన్ని సందర్శించవచ్చు.


