విద్యుదాఘాతంతో యువకుడి మృతి
జె.పంగులూరు: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని రామకూరులో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాలు.. గ్రామానికి చెందిన మహమ్మద్ వలి(37) తన డాబా మీద నీళ్ల పైపును కిందకు వేయటానికి డాబా ఎక్కాడు. పైనున్న పైపు కిందకు వేయబోగా ప్రమాద వశాత్తు నీళ్లు పైపు కరెంటు సర్వీస్ వైరుకు తగిలి షాక్ కొట్టింది. ఈ ప్రమాదంలో వలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు వలికి భార్య జాన్‌బీ, ముగ్గురు ఆడపిల్లలున్నారు. ఈ ఘటనపై ఎస్‌ఐ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పొస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.


