క్యూఎస్ ఏషియా ర్యాంకింగ్స్‌లో ఏపీలో ఏఎన్‌యూ టాప్
ఏఎన్‌యు(పెదకాకాని): క్యూఎస్ ఏషియా సంస్థ ప్రకటించిన యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 761–770 స్థానంలో నిలిచి ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీల్లో ట్యాప్ ర్యాంగ్‌లో నిలిచింది. అలానే ఆంధ్రయూనివర్సిటీ, జేఎన్‌టీయూ కాకినాడ యూనివర్సిటీలు 801–850 ర్యాంక్, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ 851– 900 ర్యాంక్, శ్రీకృష్ణ యూనివర్సిటీ 1001–1100 ర్యాంక్‌లు సాధించాయి. 2025– 26 విద్యా సంవత్సరానికి గాను ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడంపై వర్సిటీ రిజిస్టార్ ఆచార్య జి.సింహాచలం అధ్యాపకులను, విద్యార్థులను అభినందించారు.
15న ద్వితీయ హిందూ మహిళా దీపోత్సవం
తెనాలి: గతేడాది పట్టణంలో నిర్వహించిన హిందూ మహిళా దీపోత్సవం తరహాలోనే ద్వితీయ హిందూ మహిళా దీపోత్సవాన్ని ఈనెల 15వ తేదీన 1008 మంది మహిళలతో నిర్వహించనున్నట్టు హిందూ చైతన్యవేదిక నాయకులు వెల్లడించారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టరును మంగళవారం స్థానిక బోసురోడ్డులోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో ఆవిష్కరించారు. ఆరోజు సాయంత్రం 4 గంటలకు శ్రీవాసవి దేవస్థానం నుంచి పురవీధుల్లో ఊరేగింపుగా గంగానమ్మపేటలోని పాత శివాలయం వరకు చేరుకుంటుందని చెప్పారు. అక్కడ దీపాలను పెట్టి ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. తెనాలి పరిసరాల్లోని హిందూ మహిళలు హాజరుకావాలని కోరారు. సంయోజక్ మూర్తి, శారద, జిల్లా సంయోజక్ రమాదేవి, శ్రీను, విశ్వహిందూ పరిషత్ నుంచి రామాంజనేయులు, విజయలక్ష్మి, మారుతి రావెల, ధనలక్ష్మి, జయ, రమణమ్మ, పూజిత, నాగలక్ష్మి, లీల, తన్నీరు శ్రీనివాసు పాల్గొన్నారు.
నేషనల్ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుల స్వీకరణ
నెహ్రూనగర్ (గుంటూరుఈస్ట్): 2025–26 విద్యా సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఉపకారం వేతనాల మంజూరుకు దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ అధికారి కె.మయూరి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 9, 10 తరగతి, ఇంటర్ చదువుతున్న అర్హులైన ఓబీసీ/ఈబీసీ విద్యార్థులు ఈ నెల 15వ తేదీలోపు ఎన్‌ఎస్‌పీ(నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్) పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 8885177788 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
ఐదు మండలాల్లో తేలికపాటి వర్షం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు ఐదు మండలాల్లో తేలికపాటి వర్షం పడింది. అత్యధికంగా ప్రత్తిపాడు మండలంలో 20.2 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా దుగ్గిరాల మండలంలో 1.4 మి.మీ వర్షం పడింది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి..పెదనందిపాడు 6.8, కాకుమాను 6.6, కొల్లిపర మండలంలో 5.2 మి.మీ చొప్పున వర్షం పడింది.
రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు సింధూర
చీరాల: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి చెక్ పోటీలకు చీరాల విజ్ఞానభారతి స్కూల్ విద్యార్థిని అన్నపురెడ్డి సింధూర ఎంపికై నట్లు స్కూల్ డైరెక్టర్లు భూపేంద్ర, బ్రహ్మయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని చెస్ పోటీల్లో మండల, డివిజన్ స్థాయిలో గెలుపొంది ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయిలో ఒంగోలులో నిర్వహించిన పోటీల్లో గెలుపొంది రాష్ట్రస్థాయికి ఎంపికై ందన్నారు. ఈనెల 7న మన్యం జిల్లా పార్వతీపురం బొబ్బిలిలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో సింధూర పాల్గొంటుందని వివరించారు. రాష్ట్ర స్థాయిలోనూ విజయం సాధించాలని ప్రధానోపాధ్యాయులు కరీముల్లా ఆకాంక్షించారు.
క్యూఎస్ ఏషియా ర్యాంకింగ్స్‌లో ఏపీలో ఏఎన్‌యూ టాప్


