న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 1 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
ఘనంగా..
పర్లాకిమిడి: స్థానిక సంస్థల స్వపరిపాలన దినోత్సవాన్ని పర్లాకిమిడి పురపాలక సంఘం ఆవరణలో సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి, ఈఓ లక్ష్మణ ముర్ము, వైస్ చైర్మన్ లెంకమధు, 15 వార్డుల కౌన్సిలర్లు బబునా బెహరా, అమ్ములమ్మ, నారాయణరావు బెహారా, బాలకృష్ణ పాత్రో తదితరులు పాల్గొన్నారు. తొలుత పర్లాకిమిడి పలు కూడళ్లలో మహారాజా కృష్ణచంద్ర గజపతి విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం జాతీయ జెండాను చైర్మన్ నిర్మలా శెఠి ఎగురవేసి మాట్లాడారు. పర్లాకిమిడి పురపాలక సంఘంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కట్టుబడి ఉన్నామని, నగరం అందంగా తీర్చిదిద్దటానికి శాయశక్తులా కృషిచేస్తానని అన్నారు. అనంతరం పారిశుద్ధ్య సిబ్బందికి చైర్మన్ చేతులమీదుగా ఉత్తమ అవార్డులను అందజేశారు. కాశీనగర్ నగరపాలక సంస్థ (ఎన్.ఏ.సి.) స్వపరిపాలన దినోత్సవం సందర్భంగా త్రివర్ణపతాకాన్ని చైర్మన్ యం.సుధారాణి ఎగురవేసి పలువురికి మిఠాయిలు అందజేశారు.
జయపురం: లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ దినోత్సవాల సందర్భంగా జయపురం మున్సిపాలిటీ అధికారులు పలు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి జాతీయ పతాకాన్ని ఎగురవేసి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపాలిటీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు అందజేశారు. ఉత్తమ ఉద్యోగులను సన్మానించారు. మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి పూజ రౌత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బి.సునీత, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అనంతరం జయపురం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్యఅతిథిగా జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి పాల్గొన్నారు.
బొరిగుమ్మకు ఎన్‌ఏసీ హోదా
ఎట్టకేలకు జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మకు నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్(ఎన్‌ఏసీ) గా గుర్తింపు లభించింది. స్వయం పాలక దినోత్సవం సందర్భంగా బొరిగుమ్మను నోటిపైడ్ ఏరియాగా ప్రకటించారు. ఈ సందర్భంగా జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి జాతీయ పతాకాన్ని ఎగుర వేసి బొరిగుమ్మ నేటి నుంచి నోటిఫైడ్ ఏరియా అయ్యిందని వెల్లడించారు. బొరిగుమ్మ ప్రజలు నిరాహార దీక్షలు, రాస్తారోకోలు మొదలగు ఆందోళనలు జరిపిన కారణంగా నేడు ఈ విజయం దక్కిందన్నారు. తాను శాశనసభలో అనేక సార్లు ధృడంగా డిమాండ్ చేశానని, అందరి పోరాట ఫలితమే గొప్ప విజయం సాధించామన్నారు. రాష్ట్రంలో ఉత్తమ పురపాలక పరిషత్ గా నిలబెట్టేందుకు కృషి చేద్దామని ఆయన బొరిగుమ్మ ప్రజలకు పిలుపు నిచ్చారు. బొరిగుమ్మ ఉన్నతికి రాజకీయాలకు అతీతంగా సమైక్యంగా పనిచేయాలని పిలుపు నిచ్చారు.
గుడారి ఎన్‌ఏసీకి రాష్ట్ర స్థాయి పురస్కారం
రాయగడ: సొంత ఆదాయ వనరుల సమీకరణలో గణనీయమైన పురోగతి సాధించిన గుడారి ఎన్‌ఏసీ రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందింది. కేవలం ఏడాది వ్యవధిలో సొంద ఆదాయ వసూళ్లను దాదాపు 91 శాతం పెంచినందుకు రాష్ట్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్వపరిపాలన దినోత్సవంలో గుడారి ఎన్‌ఏసీకి ప్రశంసనీయ పనితీరు పురస్కారం లభించింది. దీంతో రెండు కోట్ల ప్రోత్సాహక బహుమతి నిధిని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి చేతుల మీదుగా అందజేశారు. ఈ నిధులను పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి, పౌరసేవలను మరింత బలోపేతం చేసేం
దుకు వినియోగించనున్నారు. 92 శాతం పెరిగిన సొంత ఆదాయం 2024–25 ఆర్థిక సంవత్సరంలో గుడారి ఎన్‌ఏసి 36.45 లక్షల సొంత ఆదాయాన్ని సమీకరించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఈ వసూళ్లు గణనీయంగా పెరిగి రూ.70.20 లక్షలకు చేరుకుంది. ఈ అభివృద్ధిని గుర్తించిన పట్టణాభివృద్ధి శాఖ కమండేబుల్ లోకల్ బాడీ పెర్ఫార్మెన్స్ ఇన్ గ్రొత్ ఆఫ్ ఔస్‌ఆర్ కలెక్షన్ విభాగంలో గుడారి ఎన్‌ఏసీకి పురస్కారం దక్కింది. ఈ విజయానికి కలెక్టర్ అశుతొస్ కులకర్ణి అందించిన సమర్థమైన పరిపాలన మార్గదర్శకత్వం, జిల్లా పట్టణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరక్టర్, అధికారి అక్షయ కుమార్ ఖెముండొ అందించిన ప్రాత్సాహం కీలకంగా నిలిచాయి.


