కళ్యాణసింగుపూర్‌లో 63 వినతుల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

కళ్యాణసింగుపూర్‌లో 63 వినతుల స్వీకరణ

Sep 1 2026 3:00 AM | Updated on Sep 1 2026 3:00 AM

రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్‌ సమితి కార్యాలయం సమావేశం హాల్‌లో సోమవారం వినతుల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం నిర్వహించింది. కలెక్టర్‌ అశుతోస్‌ కులకర్ణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సమితిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 63 వినతులు వచ్చాయి. వీటిలో 49 వ్యక్తిగత సమస్యలుగా గుర్తించిన అధికారులు మిగత 14 సామూహిక గ్రామ సమస్యలుగా పరిగణలోకి తీసుకున్నారు. స్వీకరించిన వినతుల్లో గ్రామ సమస్యలను పరిశీలించి సంబంఽధిత శాఖ అధికారులు త్వరితగతిన వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజ్‌ప్రసాద్‌, జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్‌ ఖెముండో, సబ్‌కలెక్టర్‌ రమేష్‌ కుమార్‌ జెన్న, ఐటీడీఏ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌ చంద్రకాంత్‌ మాఝి పాల్గొన్నారు.

కాశీనగర్‌లో 18 వినతులు..

పర్లాకిమిడి: గజపతి జిల్లా కాశీనగర్‌ పంచాయతీ కార్యాలయంలో సోమవారం జిల్లా యంత్రాంగం నిర్వహించిన జాయింట్‌ గ్రీవెన్సు సెల్‌కు అతితక్కువ స్పందన లభించింది. గ్రీవెన్సుకు ఏడీఎం మునీంద్ర హానగ అధ్యక్షత వహించగా అదనపు ఎస్పీ బిరంచీ బేగ్‌, జిల్లా పరిషత్‌ ఆదనపు సీడీవో ఫృథ్వీరాజ్‌ మండళ్‌, కాశీనగర్‌ సమితి అధ్యక్షురాలు బల్ల శాయమ్మ పాల్గొన్నారు. కేవలం 18 వినతులు మాత్రమదే అందగా వాటిలో 13 వ్యక్తిగతం, ఐదు గ్రామసమస్యలకు సంబంధించినవి ఉన్నాయి. సామిజిక పింఛన్లు, ఇళ్ల పథకం, రేషన్‌ కార్డులకు సంబంధించి పలు వినతులు అధికారులకు అందాయి. వాటిని సకాలంలో పరిష్కరించాల్సిందిగా ఏడీఎం మునీంద్ర హానగ సంబంధిత అధికారులను ఆదేశించారు. కాశీనగర్‌ బీడీవో డుంబురుధర మల్లిక్‌, తహాసీల్దార్‌, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement