రాష్ట్రపతి భవన్‌లో రక్షా బంధన్‌ వేడుకల్లో రాష్ట్ర బాలలు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి భవన్‌లో రక్షా బంధన్‌ వేడుకల్లో రాష్ట్ర బాలలు

Sep 1 2026 3:00 AM | Updated on Sep 1 2026 3:00 AM

భువనేశ్వర్‌: న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక రక్షా బంధన్‌ కార్యక్రమంలో ఒడిశాకు చెందిన నలుగురు విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్‌ 6 ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని సంతోషి మండల్‌, 7వ తరగతి విద్యార్థిని శుభ సాయి రంజిత పట్నాయక్‌, ఐఆర్‌సీ విలేజ్‌ పీఎమ్‌ శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి బిభు ప్రసాద్‌ సాహు, లోక్‌ భవన్‌ ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థి రోనక్‌ త్రిపాఠి ఒడిశా ప్రతినిధులుగా పాల్గొన్నారు. స్థానిక యూనిట్‌ 6 ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రిన్సిపాల్‌ రూపాలి సేనాపతి, ఐఆర్‌సీ విలేజ్‌ పీఎమ్‌ శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సహాయ ఉపాధ్యాయుడు తూఫాన్‌ కుమార్‌ రౌత్రాయ్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement