ఘనంగా జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం

Apr 25 2026 9:36 AM | Updated on Apr 25 2026 9:36 AM

పర్లాకిమిడి: జాతీయ పంచాయతీ రాజ్‌ దినోత్సవ వేడుకలను స్థానిక బిజూ పట్నాయక్‌ కళ్యాణ మండపంలో శుక్రవారం సాయంత్రం మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో ప్రారంభించారు. గుసాని సమతికి ప్రథమ, తృతీయ బహుమతులు వచ్చినందుకు సమితి చైర్మన్‌ వీర్రాజు అభినందనలు తెలిపారు. ఈ వేడుకల్లో జిల్లా పరిషత్‌ అధ్యక్షుడు గవర తిరుపతి రావు, జిల్లా పరిషత్‌ ముఖ్యకార్యనిర్వహణ అధికారి దయామయ పాడీ, గుసాని సమితి చైర్మన్‌ ఎన్‌.వీర్రాజు, బీడీఓ గౌరచంద్ర పట్నాయక్‌, గుసాని జెడ్పీటీసీ ఎస్‌.బాలరాజు, జిల్లా పంచాయతీ అధికారి సంతోష్‌ పట్నాయక్‌, ఎస్‌డీసీ చైర్మన్‌ కామదేవ్‌ బోడోనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

గుసాని సమితిలో ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజనా, అంత్యోదయ గృహా పథకం కింద మంజూరైన వర్క్‌ ఆర్డర్లను మోహనా ఎమ్మెల్యే పంపిణీ చేశారు. గృహా పథకాలలో గడువు ముందే పూర్తిచేసిన లబ్ధిదారులకు పదివేల రూపాయల ప్రోత్సాహాకాలు అందజేశారు. ఉత్తమ పంచాయతీలు, మిషన్‌ శక్తి , స్వయం సహాయక గ్రూపు మహిళలకు మెమొంటోలతో అధికారులు సత్కరించారు. జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని స్క్రీన్‌పై పంచాయతీ ప్రతినిధులకు చూపించారు. కళాకారులతో ఆదివాసీ, జానపద కళానృత్యాలను ప్రదర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement