మేల్కోకపోతే ముప్పే! | - | Sakshi
Sakshi News home page

మేల్కోకపోతే ముప్పే!

Feb 22 2026 8:35 AM | Updated on Feb 22 2026 8:35 AM

మేల్క

మేల్కోకపోతే ముప్పే!

మేల్కోకపోతే ముప్పే! ● ముంచుచొస్తున్న వేసవి నీటిగండం ● కానరాని ముందస్తు ప్రణాళిక ● దయనీయంగా తాగునీటి వనరులు ● తీరప్రాంత గ్రామాల్లోనూ తప్పని ఎద్దడి

పటిష్ట చర్యలు..

● ముంచుచొస్తున్న వేసవి నీటిగండం ● కానరాని ముందస్తు ప్రణాళిక ● దయనీయంగా తాగునీటి వనరులు ● తీరప్రాంత గ్రామాల్లోనూ తప్పని ఎద్దడి

హిరమండలం:

ఏడాది సంక్రాంతి నుంచే ఎండలు మండ తున్నాయి. వేసవి ప్రారంభంలోనే చుక్కలు కనిపి స్తున్నాయి. అయినా యంత్రాంగం నుంచి ఆ స్థాయి లో సన్నద్ధత కనిపించడం లేదు. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే పలుచోట్ల నీటి ఎద్దడి ప్రారంభమైంది. ముందస్తు చర్యలు తీసుకోకపోతే వేసవిలో మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో 3,129 గ్రామాలు ఉన్నాయి. చేతిపంపులు 16,210 ఉండగా.. సమగ్ర మంచినీటి పథకాలు 38, వాటర్‌ ట్యాంకులు 1280 ఉన్నాయి. నేరుగా పంపింగ్‌ చేసే పథకాలు 440 కొనసాగుతున్నాయి. అయితే వీటి నిర్వహణ సరిగ్గా లేదు. ఏటా వేసవి ముందస్తుగా క్రాష్‌ ప్రొగ్రాం నిర్వహించాల్సి ఉంటుంది. కానీ తూతూమంత్రంగా చేపడుతున్నారన్న విమర్శలున్నాయి. తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టి చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రాష్‌ ప్రొగ్రాం విజయవంతం కావాలంటే మండల, పంచాయతీ అధికారు ల మధ్య సరైన సమన్వయం ఉండాలి. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదు. భూ గర్భ జలాలు అడుగంటే సమయంలో ప్రత్యామ్నాయ మార్గా ల ద్వారా నీరందించే లా ఏర్పాట్లు చేయాలి. కానీ ఇంతవరకూ ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదన్న విమర్శలు వస్తున్నాయి.

ఆ మూడు నియోజకవర్గాల్లో..

జిల్లాలో పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాలకు తాగునీరు అందించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.700 కోట్లతో ఉద్దానం సమగ్ర మంచినీటి పథకాన్ని నిర్మించింది. దాదాపు 95 శాతం పనులు పూర్తికాగా.. ట్రయల్‌ రన్‌ వేసి పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు సమీపిస్తున్నా ఉద్దానం సమగ్ర మంచినీటి పథకం సేవలను పూర్తిగా అందుబాటులోకి తేలేకపోయారు. మరోవైపు ఫేజ్‌–2లో భాగంగా పాతపట్నం నియోజకవర్గానికి తాగునీరు అందిస్తామని చెప్పారు. ఆ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతు న్నాయి. ఉద్దానం సమగ్ర మంచినీటి పథకం పేరు తో ఈ మూడు నియోజకవర్గాల్లో తాగునీటి పథకా ల నిర్వహణపై నిర్లక్ష్యం కొనసాగుతోంది. దీంతో ప్రజలకు వేసవిలో తాగునీటి ఇక్కట్లు తప్పేలా లేవు.

వంశధార నది చెంతనే ఆనుకుని ఉన్న హిరమండలం మేజర్‌ పంచాయతీలో

వేసవిలో ఎప్పుడూ నీటికి చింతే. సీజన్‌ ప్రారంభంలోనే ఇక్కడ దాహం కేకలు వినిపిస్తుంటాయి. ఇటీవలే స్థానికుల దాహార్తి తీర్చేందుకు పంచాయతీ యంత్రాంగం ప్రత్యేక తాగునీటి ట్యాంకర్‌ను ఏర్పాటుచేశారు. నది చెంతనే ఉండే హిరమండలంలోనే పరిస్థితి ఇలా ఉందంటే జిల్లా వ్యాప్తంగా ఎలా ఉండబోతోందో అర్ధం చేసుకోవచ్చు.

వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా పటిష్ట చర్య లు చేపడుతున్నాం. క్రాష్‌ ప్రొగ్రాంలో భాగంగా తాగునీటి వనరులను బాగుచేయిస్తాం. ఇందు కు సంబంధించి ప్రణాళిక రూపొందించాం. ఈ విషయంలో అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – శంకరంబాబు, ఆర్‌డబ్ల్యూఎస్‌

ఇన్‌చార్జి ఎస్‌ఈ, శ్రీకాకుళం

మేల్కోకపోతే ముప్పే! 1
1/1

మేల్కోకపోతే ముప్పే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement