మోగిన మాక్ సైరన్
అది రణస్థలం మండలం సరగడపేట గ్రామంలో శ్రేయాస్ ఇండస్ట్రీస్ ఆవరణ. సమయం శనివారం ఉదయం 11.30. పారిశ్రామిక ప్రాంతంలో క్లోరిన్ తరలిస్తున్న వాహనం బోల్తా పడి విషవాయువులు దట్టంగా వ్యాపిస్తున్నట్లు సైరన్ మోగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పసుపు పచ్చని మేఘంలా వాయువు విస్తరిస్తున్న తరుణంలో అప్పటికే సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు ప్రాణాలకు తెగించి రంగంలోనికి దిగాయి. విష వాయువులు పీల్చి అపస్మారక స్థితికి చేరుకున్న బాధితులను అంబులెన్సులో తరలించి సమీపం వైద్య శిబిరానికి తరలిస్తున్నారు. ఇదంతా మాక్‌డ్రిల్ అని పైడిభీమవరం పారిశ్రామికవాడలోని ఒక్క సరగడపేట గ్రామస్తులకు తప్పా మిగతా గ్రామాల ప్రజలకు తెలియకపోవడంతో ఉలిక్కిపడ్డారు. కొంతసేపటికి విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. కార్యక్రమంలో పరిశ్రమల సంయుక్త తనిఖీ అధికారి శివశంకర్, ఉప ముఖ్య తనిఖీ ఆధికారి బి.రాంబాబు, జిల్లా విపత్తు నిర్వహణ అధికారి రాము, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మోహనరావు, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్టీఆర్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్లు, సత్యనారాయణ, చంద్రశేఖర్, మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ గంగాధర్, ఏపీటోరియా హెచ్‌ఆర్ హెడ్ పి.ఎన్.రావు, సేఫ్టీ హెడ్ సంతోష్, శ్రేయాస్ సీఈవో మనోజ్ శ్రీవాస్తవ్, చీఫ్ సేప్టీ ఆఫీసర్ కన్నారావు, రఘునాథరావు తదితరులు పాల్గొన్నారు.
– రణస్థలం
మోగిన మాక్ సైరన్
మోగిన మాక్ సైరన్
మోగిన మాక్ సైరన్
మోగిన మాక్ సైరన్


