ఆరు కేజీల గంజాయితో వ్యక్తి అరెస్ట్
ఇచ్ఛాపురం : ఆరు కేజీల గంజాయితో ఒడిశాకు చెందిన బిక్రమ్ ఉతాన్‌సింగ్‌ను అరెస్ట్ చేసినట్లు ఇచ్ఛాపురం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి పి.దుర్గాప్రసాద్ తెలిపారు. శనివారం స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒడిశాకి చెందిన బిక్రమ్ ఉతాన్‌సింగ్ ద్విచక్ర వాహనంపై ఆరు కేజీల గంజాయిని తీసుకొస్తూ పట్టుబడ్డాడు. నిందితుడి వద్ద నుంచి 6 కేజీల గంజాయి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించారు. ఈ దాడుల్లో యాంటీ నార్కోటిక్ ఫోర్స్ బృందం, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు.
పండ్లతోటలు దగ్ధం
బూర్జ: మండలంలోని ఒ.వి.పేట గ్రామంలో రెండు ఎకరాల మామిడితోట, రెండు ఎకరాల జీడితోట, రెండు వరి చేలు కుప్పలు, గడ్డి వాములు దగ్ధమయ్యాయని ఆమదాలవలస అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. సుమారు మూడు లక్షల రూపాయల ఆస్తి నష్టం ఉంటుందని అంచనా వేశారు. ప్రమాదానికి కారణాలు తెలియలేదు. శనివారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి ఉంటారని భావిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఆమదాలవలస అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు. జీడి మామిడి పూత, పిందె దశలో ఉండగా ప్రమాదం జరగడంతో రైతులు లబోదిబోమంటున్నారు.


