వందేళ్ల కమ్యూనిస్టు నేత మృతికి నివాళులు
జయపురం: వందేళ్ల కమ్యూనిస్టు నేత, అఖిల భారత కృషక్ సమాజ్ ఒడిశా రాష్ట్ర అధ్యక్షుడు, కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ మండలి సభ్యులు, ప్రముఖ సాహితీ వేత్త కామ్రేడ్ సోమనాథ్ పాత్రో (102) మృతికి కొరాపుట్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ కన్నీటి నివాళులు అర్పించింది. కామ్రేడ్ సోమనాథ్ పాత్రో గురువారం ఉదయం మృతి చెందారు. స్థానిక కార్మిక భవనంలో శుక్రవారం కృషక సభ నాయకులు ఝుఽధిస్టర్ రౌళొ అధ్యక్షతన జరిగిన సంతాప సభలో కమ్యూనిస్టు పార్టీ కార్యవర్గ సభ్యులు ప్రముఖ కార్మిక నేత ప్రమోద కుమార్ మహంతి మాట్లాడుతూ స్వర్గీయ సోమనాథ్ పాత్రో రైతు సమాజానికి, వారి సంక్షేమానికి, ప్రయోజనాలకు అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. కమ్యూనిస్టుగా, సాహితీ వేత్తగా ఆయన సమాజానికి అందించిన సేవలు మరువ లేనివని అన్నారు. ఆయన కలం నుంచి వెలువడిన గీతా విచార్ అనే పుస్తకం మహాభారతంపై ప్రజలను ఆలోచింప చేసిన ఒక గ్రంథమైందని తెలిపారు.
వందేళ్ల కమ్యూనిస్టు నేత మృతికి నివాళులు


