ఫిబ్రవరి 28, మార్చి ఒకటి తేదీల్లో ఉత్కళ సమ్మిళిణి మహాసభ
జయపురం: ఉత్కళ సమ్మళిణి కొరాపుట్ జిల్లాశాఖ మహాసభలను ఫిబ్రవరి 28, మార్చి ఒకటో తేదీల్లో జరపాలని ఉత్కళ సమ్మిళిణి కమిటీ నిర్ణయించింది. శుక్రవారం స్థానిక కాళ్ల సాహి హరిశ్చంద్రపార్క్‌లో సమ్మిళిణి ఉపాధ్యక్షుడు రాజేంద్రకుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన జిల్లా ఉత్కళ సమ్మిళిణి కార్యవర్గ సమావేశంలో సభల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు. మహాసభ క్రమశిక్షణతో శాంతి యుతంగా ఘనంగా నిర్వహించాలని సమావేశం నిర్ణయించి అందుకు చేపట్టవలసిన కార్యక్రమం రూపొందించాలని సమావేశం ఆమోదించింది. మహాసభ విషయం పత్రికలు, పోస్టర్ల ద్వారా విస్తృత ప్రచారం, కరపత్రాల పంచటం, అతిథులకు ఆహ్వానం, ఆతిథి ఏర్పాట్లు, సభ్య సేకరణ మొదలగు అంశాలపై సమావేశం సుధీర్ఘంగా చర్చించింది. సమ్మిళిణి బ్యాంక్ ఖాతాను సమర్థవంతంగా నిర్వహించే బాధ్యతలను కార్యదర్శి నవీణ మదళకు అప్పగించింది. ఈ సందర్భంగా మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో ఉత్కళ సమ్మిళిణి రాష్ట్ర పరిషత్ సభ్యులు సూర్యనారాయణ రథ్, బాలా రాయ్, సంస్థాగత కార్యదర్శి కవిరాజ్ పరమేశ్వర పాత్రో, చంద్రమణి బారిక్, కృష్ణ చంద్రహోత్త పాల్గొన్నారు.


