జూనియర్ రెడ్‌క్రాస్ శిబిరం ప్రారంభం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితిలో శనివారం ఉన్నత పాఠశాలలో మూడు రోజుల పాటు జూనియర్ రెడ్‌క్రాస్ శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లా విద్యాశాఖాధికారి చిత్తరంజాన్ పాణిగ్రాహి అధ్యక్షతన నిర్వహించిన ప్రారోంభత్సవం కార్యక్రామంలో ముఖ్యఅతిథులుగా మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మడ్కమి హాజరయ్యారు. శిబిరంలో 111 పంచాయతీలకు చెందిన వివిధ పాఠశాలల నుంచి 400 మంది విద్యార్థులు హాజరయ్యారు. మూడురోజులు పాటు విద్యార్థులకు ప్రథమ చికిత్సపై శిక్షణ, రక్తదానంపై అవగాహన, విపత్తు నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, శ్రమదానంపై శిక్షణ ఇస్తారు.
జూనియర్ రెడ్‌క్రాస్ శిబిరం ప్రారంభం
జూనియర్ రెడ్‌క్రాస్ శిబిరం ప్రారంభం


