ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలి
రాయగడ: పాఠశాల ప్రాంగణంలోని సరస్వతి, వినాయక స్వామి విగ్రహాలను విరగొట్టిన అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న కె.కృష్ణరాజుపై చర్యలు తీసుకోవాలని భజరంగదళ్, విశ్వహిందు పరిషత్‌లకు చెందిన కార్యకర్తలు కోరారు. ఈ మేరకు కలెక్టర్ అశుతోస్ కులకర్ణి, ఎస్పీ స్వాతి ఎస్.కుమార్‌లకు వినతిపత్రాలు శుక్రవారం అందజేశారు. జిల్లాలో మునిగుడ సమితి అంబొదలలోని ప్రభుత్వ ఉన్నత మాధ్యమిక పాఠశాలలో ఈనెల 15వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. వినతిపత్రం అందజేసినవారిలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆనందరావు, కార్యదర్శి రమేష్ కున, సహ కార్యదర్శి గోపి బ్రహ్మ, రంజన్ స్వాయి తదితరులు ఉన్నారు.


