● సంప్రదాయం ‘కనుమ’..!
అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో కనుమ పర్వదినం సందర్భంగా స్థానిక గోశాలలో పవిత్ర గోపూజోత్సవం శుక్రవారం వేదోచ్ఛరణ, మంగళధ్వనుల నడుమ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ మాట్లాడుతూ సకలదేవతల దర్శనాలు, ఒక్క గోమాత దర్శన పుణ్యంతో సమానమని గోవు విశిష్టతను పురాణాల్లో ఉన్న విషయాలను వివరించారు. ఏడాది పొడవునా పశుసంపద మానవాళికి చేసిన మేలునకు కృతజ్ఞతగా ప్రతి కనుమ పండుగ నాడు ఇలా గోమాతలను పూజిస్తారని వివరించారు. హిందు ధర్మ ప్రతీకగా ఉన్న గోవుకు ఎంతో విశిష్టత, ఔషద తత్వాలు న్నాయని వివరించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది శోభనాద్రాచార్యులు, బిఎస్.చక్రవర్తి, ఆల య అర్చకులు ఇప్పిలి రంజిత్ శర్మ, ఇప్పిలి సాందీప్‌శర్మ, ఫణీంద్ర శర్మ, షన్ముఖశర్మ, నేతేటి హరిప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
–అరసవల్లి


