గంజాయితో ఇద్దరు అరెస్టు
రాయగడ: జిల్లాలోని మునిగుడ పోలీస్ స్టేషన్ పరిధిలో తెలంగపదర్ కూడలిలో గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిని కంధమాల్ జిల్లా తుమిడిబొందొ ప్రాంతానికి చెందిన ఆహితా మండల్, సదమ్ నాయక్‌లుగా గుర్తించారు. వీరి వద్ద నుంచి 27.200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఆటోను సీజ్ చేసి నిందితులను కోర్టుకు తరలించినట్లు ఐఐసీ కేశవ్ షడంగి తెలిపారు.
ఆదిత్యున్ని దర్శించుకున్న పాట్నా హైకోర్టు జస్టిస్ అనుపమ చక్రవర్తి
అరసవల్లి: ప్రఖ్యాత సూర్యదేవాలయాన్ని పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుప మ చక్రవర్తి కుటుంబ సమేతంగా గురువారం మకర సంక్రాంతి సందర్భంగా దర్శించుకున్నా రు. ఈ మేరకు ఆరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయ అధికారులు, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ వారికి గౌరవంగా సంప్రదాయ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అంతరాలయంలో గోత్రనామాలతో ప్రత్యేక అర్చనల అనంతరం అనివెట్టి మండపంలో వేదాశీర్వచనాన్ని తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ప్రొటోకాల్ అఽధికారిక సిబ్బంది పాల్గొన్నారు.
ఒడిశా బస్సు ఢీ కొని
యువకుడికి గాయాలు
సారవకోట: ఓఎస్‌ఆ ర్టీసీ బస్సు ఢీ కొని మండలంలోని వడ్డినవలస గ్రామానికి చెందిన యువకుడు బక్క రమణ గాయాల పాలయ్యా డు. నరసన్నపేట నుంచి ఒడిశాలోని పర్లాకిమిడి వెళ్తున్న ఓఎస్ ఆర్టీసీ బస్సు వడ్డినవలస గ్రామానికి సమీపంలో మూత్ర విసర్జనకు వెళ్లి వస్తున్న యువకుడిని ఢీ కొట్టింది. దీంతో గాయాలపాలైన రమణను స్థానికులు, కుటుంబ సభ్యులు 108 వాహనంలో నరసన్నపేట ఆస్పత్రికి అక్కడి నుంచి శ్రీకాకుళం తరలించారు. శుక్రవారం క్షత్రగాత్రుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ అనిల్ కుమార్ కేసు నమోదు చేశారు.
23న అరసవల్లి శోభాయాత్ర
శ్రీకాకుళం పాతబస్టాండ్: అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థాన రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 19న జరగాల్సిన ‘శోభాయాత్ర’ను 23వ తేదీకి మారుస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది ఈ వేడుకలను తొలిరోజే శోభాయాత్రతో అత్యంత వైభవంగా ప్రారంభించామని, అయితే మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మృతితో జిల్లాలో సంతాప పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ సారి మార్పు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 23వ తేదీ మధ్యాహ్నం నుంచి శోభాయాత్రను నిర్వహించనున్నట్లు కలెక్టర్ వివరించారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్‌లతో సంప్రదింపులు జరిపిన అనంతరం, అరసవల్లికి చెందిన దివంగత నేతకు గౌరవ నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో తొలి మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాలను కూడా చాలా వరకు తగ్గించామని, అయితే భక్తుల దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు.
గంజాయితో ఇద్దరు అరెస్టు
గంజాయితో ఇద్దరు అరెస్టు
గంజాయితో ఇద్దరు అరెస్టు


