రూ. 12.26కోట్ల మద్యం తాగేశార్రోయ్..
శ్రీకాకుళం క్రైమ్, ఎచ్చెర్ల : మందుబాబులు ‘పండగ’ చేసుకున్నారు. సంక్రాంతి మూడు రోజులూ మద్యపాన సంబరం చేసుకున్నారు. పండగను దృష్టిలో ఉంచుకుని మద్యం దుకాణాల యజమానులు ఈ నెల 13, 14 తేదీల్లో రూ. 11.65 కోట్లు విలువైన మద్యాన్ని ఎచ్చెర్ల డిపో నుంచి తీసుకొచ్చారు. 13వ తేదీ నుంచి 16వ తేదీ కనుమ రాత్రి 7 గంటల వరకు ఏకంగా రూ. 12.26 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. జిల్లాలో 176 ప్రైవే టు లైసెన్సు దుకాణాలు, 9 బార్ అండ్ రెస్టారెంట్లు ఉండగా పట్టణ ప్రాంతాలైన శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, ఆమదాలవలస, కాశీబుగ్గ, ఇచ్ఛాపురంలో అధికంగా మద్యం అమ్ముడుపోయింది.
ఎమ్మార్పీకి మించి..
ఈ నెల 12న రాష్ట్ర ప్రభుత్వం బాటిల్‌పై అదనంగా రూ. 10 లు పెంచుతూ జీఓ విడుదల చేసింది. అప్పటికే పాత స్టాకు ఉండటంతో దుకాణదారులు పాత ఎమ్మార్పీ స్టిక్కర్ ఉన్న బాటిల్‌పై రూ. 10 తీసుకోవాల్సి ఉన్నా.. జిల్లాలో అధిక ప్రాంతాల్లో ఎమ్మార్పీకి మించి రూ. 10 నుంచి రూ. 30 వరకు అదనంగా వసూలు చేశారు. క్వార్టర్ బాటిల్‌పై రూ. 10లు, బీరు, ఆఫ్‌బాటిల్‌పై రూ. 20 లు, ఫుల్ బాటిల్‌పై రూ. 30 లు అధికంగా తీసుకున్నారు. ఊరూరా ఇప్పటికే బెల్టుషాపులుండగా పండగ రోజులు అదనంగా ఒకట్రెండు కొత్తగా వెలిశాయి. అమ్మకందారులు ఒక్కో బాటిల్‌పై రూ. 30 నుంచి రూ. 80 వరకు ప్రాంతం, డిమాండ్‌ను బట్టి మద్యం ప్రియుల జేబులు చిల్లు చేశారు. పండగ రోజులు కావడంతో సంబంధిత ఎకై ్సజ్ శాఖ పోలీసులు చూసీ చూడనట్లు వదిలేశారు.
పండగ సందర్భంగా జిల్లాలో భారీగా మద్యం విక్రయాలు
ఎక్కడికక్కడ వెలసిన బెల్టుషాపులు
డిమాండ్ దృష్ట్యా బాటిల్‌పై అదనంగా రూ. 30 నుంచి రూ. 80 వరకు వసూలు
రూ. 12.26కోట్ల మద్యం తాగేశార్రోయ్..
రూ. 12.26కోట్ల మద్యం తాగేశార్రోయ్..


