రాయి పడి ఇద్దరు కార్మికులు మృతి
మల్కన్‌గిరి : స్థానిక తరణి ఆలయం సమీపంలో శుక్రవారం ఉదయం క్వారీ వద్ద అక్రమంగా మురుం మట్టి తవ్వుతుండగా భారీ రాయిపడడంతో సత్యంగూఢ గ్రామానికి చెందిన టూనా గదబ(21) చనిపోయాడు. చంపాఖారి గ్రామానికి చెందిన మితు మాడీ (31)ని స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జి.శ్రీనివాస రావు, తదితరులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. క్వారీ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. మల్కన్‌గిరి ఐఐసీ రీగాన్ కీండో సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
రాయి పడి ఇద్దరు కార్మికులు మృతి


