సంక్రాంతి సంబరాలు
న్యూస్‌రీల్
రాయిపడి ఇద్దరు కార్మికులు.. రాయి పడి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. క్వారీలో ఘటన జరిగింది. –IIలోu
శనివారం శ్రీ 17 శ్రీ జనవరి శ్రీ 2026
అంబరాన్నంటిన..
● ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
● హాజరైన తెలుగు ప్రముఖులు
శ్రీ మందిరం ఆదాయం లెక్కింపు
నగదు : రూ. 6,33,695
బంగారం : 1 గ్రాము 700 మిల్లీ గ్రాములు
వెండి : 166 గ్రాముల 700 మిల్లీ గ్రాములు
– భువనేశ్వర్/పూరీ
కొరాపుట్: నిర్వాహకుడు కనుదాస్‌తో
కమిటీ సభ్యులు
కొరాపుట్: తెలుగు వారి పెద్దపండగ సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని ఆర్‌సీడీ హైస్కూల్ మైదానంలో నబరంగ్‌పూర్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నిత్యానంద గొండో ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించారు. అనువదించిన తెలుగు ప్రసంగాన్ని చదివి వినిపించారు. ఇటువంటి కార్యక్రమాలు నిత్యం కొనసాగించాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే గౌరీశంకర్ మజ్జి ప్రసంగిస్తూ జిల్లాలో తెలుగు ప్రజలు శాంతి సామరస్యాలకు మారుపేరుగా నిలుస్తున్నారని చెప్పారు. గత 60 ఏళ్లుగా సుమారు 500 మృతదేహాలకు స్వచ్ఛంద సేవగా అంత్యక్రియలు నిర్వహించి టైలర్ పొట్నూరు రమణ, వేలాది మందికి తెలుగు విద్య బోధించిన అప్పలస్వామి మాస్టార్లను ఘనంగా సత్కరించారు. సుమారు పదేళ్లు అనంతరం ఉత్సవాలు పున ప్రారంభించినందుకు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మానస్ రంజన్ దాస్ (కను)ను తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఉత్సవాల నిర్వహణకు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్, చాంబర్ ఆఫ్ కామర్స్ సహకారం అందించాయి. విశాఖ పట్నానికి చెందిన రోషన్‌లాల్ ఆర్కెస్ట్రా, ఇతర సాంస్కృతి బృందాల ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి, కలెక్టర్ మహేశ్వర్ స్వయ్, మున్సిపల్ చైర్మన్ కునునాయక్, సీనియర్ కాంగ్రెస్ నేత మున్నా త్రిపాఠి, సీనియర్ న్యాయవాది జాడేశ్వర్ ఖడంగా, పి.ఎల్.మూర్తి, పూసర్ల రామారావు, వి.మహేష్, వి.రవి, వి.సంతోష్, కె.శ్రీను, మణి తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో..
జయపురం: స్థానిక జయపురం కల్యాణ మండపంలో రాష్ట్రీయ స్వయం సేవా సంఘం జయపురం శాఖ వారిచే పట్టణ స్థాయి మకర సంక్రాంతి పండగ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి వేడుకలలో జయపురం చాంబర్ ఉపాధ్యక్షుడు ఎ.శ్రీనివాస రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ సంఘ నిర్వాహకుడు నిరంజన్ మిశ్ర, కార్యనిర్వాహకుడు డాక్టర్ మనోరంజన్ ప్రధాన్ ముఖ్యవక్తగా కొరాపుట్ సెంట్రల్ యూనివర్సిటీ ఫ్రొఫెసర్ భరత్ కుమా ర్ పండ పాల్గొన్నారు. ముఖ్యవక్త భరత్ కుమార్ పండ మాట్లాడుతూ హిందువుల పండగలలో మకర సంక్రాంతి పండగ ప్రాధాన్యతను వివరించారు.
రాయగడలో..
రాయగడ: జిల్లాలోని గుణుపూర్‌లో అయ్యప్ప ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నాయి. కూచిపూడి తదితర నృత్య ప్రదర్శనలు నిర్వహించి బహుమతులను అందజేశారు.
పర్లాకిమిడిలో..
పర్లాకిమిడి: తెలుగు చిత్రరంగంలో తన తొలి సినిమా 1978లో పునాది రాళ్లు అయినా తన టాలెంట్‌ను చూసి ప్రముఖ దర్శకులు విశ్వనాథ్ ప్రెసిడెంటు పేరమ్మలో వేషం ఇప్పించారని సినీ హాస్య నటుడు ఆలీ అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ 1200 తెలుగు, మలయాళం, తమిళ, కన్నడ, హిందీ, నేపాలీ భాషా సినిమాల్లో నటించానని తెలిపారు. పరలా మకర సంక్రాంతి ఉత్సవాలను స్థానిక రాంనగర్‌లో హైటెక్ ప్లాజాలో గురువారం సాయంత్రం నిర్వహించారు. తెలుగు చలనచిత్ర హాస్యనటులు ఆలీ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ మకర సంక్రాంతి ఉత్సవాలు హైటెక్ మెడికల్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి ఆధ్వర్యంలో జరుగగా, ఆయన తనయుడు ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, ఇతర అతిథులుగా పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ గవర తిరుపతి రావు, పర్లాకిమిడి పురపాలక చైర్మన్ నిర్మలా శెఠి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ ఉత్సవాలలో ఆలీ తన గత సినిమాల కామెడీ డైలాగులు చెబుతూ డ్యాన్స్‌లు చేసి ఉర్రూతలూగించారు. వేదికపై జబర్దస్త్ బుల్లితెర నటులు బుల్లెట్ భాస్కర్, ఫాతిమా, నరేష్‌లు హాస్య పేరడీలు ప్రేక్షకులకు నవ్వు తెప్పించాయి.
సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి సంబరాలు


