వారణాసి–అయోధ్యకు మల్కన్‌గిరి నుంచి 75 మంది పయనం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా నుంచి శుక్రవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం వద్ద పర్యాటక శాఖ నేతృత్వంలో వేయ్యార్ నిక్రతిక్ తీర్థయాత్ర యోజన పథకం కింద జిల్లా నుంచి రాయగడకు రెండు బస్సుల్లో ప్రయాణికుల యాత్రను జిల్లా అదనపు కలెక్టర్ వేద్బర్ ప్రధన్ జెండా ఊపి ప్రారంభించారు. రాయగడ నుంచి రైలులు వారణాశి, అయోధ్య వెళ్లనున్నారు. ముందుగా వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆధార్ కార్డులు సేకరించారు. పురుషుల కోసం జిల్లా రెవెన్యూ అధికారి రవీంద్ర నాయక్, మహిళల కోసం క్రీడా ఉపాధ్యాయురాలు బబితా మొహంతి వెళ్తున్నారు.


