గజపతి ఉత్సవాల ప్రచార రథం, పోస్టర్ ఆవిష్కరణ
పర్లాకిమిడి: కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో జిల్లా సాంస్కృతిక పరిషత్ ఆధ్వర్యంలో గజపతి ఉత్సవాలు 2026 ప్రచార రథం, పోస్టర్‌ను కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్ ప్రారంభించారు. ఈ నెల 18 నుంచి 22 వరకూ పర్లాకిమిడి గజపతి స్టేడియంలో జరగనున్న గజపతి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా ప్రజాపనులు, న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ తొలిరోజు ప్రారంభోత్సవానికి రానున్నట్టు తెలియజేశారు. కళ, సంస్కృతి, సాహిత్యం, పరంపరకు పేరొందిన భూమి గజపతి జిల్లా అని కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్ అన్నారు. జిల్లాలోని ఏడుసమితి కేంద్రాల్లో గజపతి ఉత్సవాల ప్రచార రథం తిరిగి ప్రచారం చేస్తుందని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక చైర్మన్ నిర్మలా శెఠి, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరజ్, ఏడీఎం ఫల్గుణి మఝి, పృథ్వీరాజ్ మండల్, ప్రచార కమిటీ సభ్యులు భాగవత్ పాఢి తదితరులు పాల్గొన్నారు.
గజపతి ఉత్సవాల ప్రచార రథం, పోస్టర్ ఆవిష్కరణ


