అయ్యప్ప స్వామికి స్వర్ణ కిరీటం
రాయగడ: జిల్లాలోని గుణుపూర్‌లో కొలువైయున్న అయ్యప్ప స్వామికి 40 తులాల బంగారంతో రూపొందించిన స్వర్ణ కిరీటాన్ని అలంకరించారు. సంక్రాంతి పురస్కరించుకొని ప్రత్యేక పూజలను స్వామివారికి నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామికి లక్ష చామంతులు, గులాబీలతో అభిషేకించారు. తదుపరి జ్యోతి దర్శన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆలయ కమిటీకి చెందిన సుబుద్ధి గౌరి, లాడి రఘు, లాడి రమేష్, గిరిజాల అనంతరావు తదితరులు పాల్గొన్నారు.
రాయగడలో
జన కల్యాణకారి దినోత్సవం
రాయగడ: బీఎస్పీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతి జన్మదినం పురస్కరించుకొని జిల్లా బీఎస్పీ పార్టీ నాయకులు జన కల్యాణకారి దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక కొత్త బస్టాండ్ వద్దనున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా స్థానిక తేజస్వీ మైదానానికి చేరుకొని పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సరోజ్ నాయక్, జిల్లా అధ్యక్షుడు పూర్ణ చంద్ర టక్రీ, జిల్లా పరిశీలకుడు రామదాస్ టక్రీ, సీనియర్ నాయకుడు జితు జకసికల నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ బలోపేతానికి సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
అయ్యప్ప స్వామికి స్వర్ణ కిరీటం


