కాంగ్రెస్ పటిష్టతకు కృషి చేయాలి
● బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక
రాయగడ: కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో కృషి చేయాలని బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక అన్నారు. మునిగుడలోని ఇన్‌స్పెక్షన్ బంగ్లాలో సోమవారం సాయంత్రం పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుందని అన్నారు. గత ఎన్నికల్లో విజయం సాధించిన ఈ జిల్లాలో రానున్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా పార్టీ జెండాను ఎగురవేయాలని అన్నారు. ఇప్పటి నుంచే కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్లి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా సమితి పరిధిలో వివిధ ప్రాంతాలకు చెందిన 50 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కాంగ్రెస్ జెండాను కప్పి ఆహ్వానం పలికారు. పార్టీ బలొపేతానికి అంతా కలసి కట్టుగా పనిచేయాలని హితవు పలికారు. కార్యక్రమంలో రజనీ కాంత్ పొడొల్, రమేష్ పలకీయ, మునిగుడ పంచాయతీ సర్పంచ్ సరస్వతి సబర్, తెలంగాపొదొరొ, సమితి సభ్యులు అనంగ్ నాగ్ పాల్గొన్నారు.


