మత్తు పదార్థాల విముక్తితో వికసిత్ భారత్
పర్లాకిమిడి: యువత మత్తు పదార్థాలను వదిలేస్తేనే వికసిత భారత్ సాధ్యమని సఖీ వన్‌స్టాప్ సెంటర్, ఐఎస్‌ఆర్‌డీ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ నుంచి ఒక ర్యాలీని ఆదనపు కలెక్టర్ మునీంద్ర హానగ ప్రారంభించారు. యువజనోత్సవాలు సందర్భంగా యువత మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటే సమీప భవిష్యత్‌లో వికసిత్ భారత్ సంభవమని కలెక్టర్ మునీంద్ర అన్నారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి, జిల్లా సంక్షేమ శాఖ అధికారిని మనోరమాదేవి, జువెనల్ కోర్టు ప్యానల్ లాయర్ భాగ్యలక్ష్మీ నాయక్, జిల్లా సామాజిక, భధ్రత, సంక్షేమ శాఖ అఽధికారి సరలా పాత్రో, జిల్లా శిశు సురక్షా యునిట్, చైల్డ్ లైన్, ట్రాన్స్‌జెండర్ కార్యదర్శి జాస్మిన్ షేక్, వివిధ పాఠశాలలు, కళాశాల విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మెడికల్ రోడ్డులో ఉన్న వనస్టాప్ సెంటర్ రిసోర్స్ భవనంలో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
మత్తు పదార్థాల విముక్తితో వికసిత్ భారత్


