నదిలో మునిగి యువకుడు మృతి
రాయగడ: స్నానానికని నదిలో దిగి నీటి ప్రవాహానికి మునిగిపోయి ఊపిరాడక ఒక యువకుడు మృతి చెందిన ఘటన జిల్లాలోని గుణుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లుంగురుతల గ్రామ సమీపంలో గల చిన్న నది వద్ద ఆదివారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి గుణుపూర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ప్రపుల్ల మిశ్రొ కొడుకు జొగా మిశ్రో (35) గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది నదిలో గాలించి జొగా మృతదేహాన్ని వెతికి బయటకు తీశారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం ... గుణుపూర్‌కు చెందిన కొంత మంది స్నేహితులతో కలిసి జొగ ఆదివారం నాడు పిక్నిక్ వెళ్లాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం పిక్నిక్ ప్రాంతం నుండీ సమీపంలో గల చిన్న గెడ్డ వద్ద స్నానానికని దిగాడు. దీంతో మునిగిపొయి మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


