ముగిసిన వార్షిక క్రీడోత్సవాలు
జయపురం: జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో శనివారం ప్రారంభమైన రెండు రోజుల వార్షిక క్రీడోత్సవ పోటీలు ఆదివారంతో ముగిశాయి. రెండు దినాలు జరిగిన ఈ పోటీలు ప్రారంభ దినాన విశ్వవిద్యాలయ క్రీడా మైదానం నుంచి విద్యార్థులు, క్రీడాకారులు శోభాయాత్ర ప్రారంభించారు. మా భగవతీ మందిరం వద్దకు వెళ్లి అక్కడ క్రీడా మశాలా జ్యోతిని వెలిగించి అక్కడ నుంచి శోభా జాత్ర నిర్వహించుకుంటూ విశ్వ విద్యాలయ క్రీడా మైదానానికి చేరారు. అక్కడ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డాక్టర్ దేవీ ప్రసాద్ మిశ్ర క్రీడా మశాలను స్వీకరించారు. అనంతరం క్రీడా పతాకాన్ని ఎగురవేశారు. ప్రారంభోత్సవంలో విశ్వద్యాలయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ పాత్రో, డాక్టర్ ప్రశాంత కుమార్ పాత్రో, క్రీడా పోటీల నిర్వాహక కార్యదర్శి సచిన్ కుమార్ నాయిక్, ఉపాధ్యక్షులు డాక్టర్ ఋషభ కుమార్ సాహు, సంతోషిణీ ముండ, క్రీడా శిక్షకులు భగవత్ ప్రసాద్ సింగ్, విశ్వవిద్యాలయ అధ్యాపకులు సిబ్బంది పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు. బహుమతి ప్రదానోత్సవంలో పాల్గొన్న విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ దేవీ ప్రసాద్ మిశ్ర మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న క్రీడా ప్రతిభను వెలుగులోకి తీసుకురావడం, క్రీడాకారుల్లో ఆత్మ విశ్వాసం పెంపొందించటం ప్రధాన లక్ష్యంగా క్రీడా పోటీలు నిర్వహించినట్లు వెల్లడించారు.
ముగిసిన వార్షిక క్రీడోత్సవాలు
ముగిసిన వార్షిక క్రీడోత్సవాలు
ముగిసిన వార్షిక క్రీడోత్సవాలు


