ముందుకు సాగాలి
సేవా దృక్పథంతో..
రాయగడ: స్వచ్ఛంద సేవా సంస్థల్లో చేరే ప్రతీఒక్కరూ సేవ దృక్పథం కలిగి ఉండాలని వాకర్స్ ప్రాంతీయ అధ్యక్షులు పి.గోవిందగుప్త అన్నారు. స్థానిక సాయిప్రియ వాకర్స్ క్లబ్, సాయిప్రియ మహిళా వాకర్స్ క్లబ్‌లకు చెందిన కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం రిలియన్స్ మార్ట్ సమీపంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం సందడిగా జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. రాయగడలో ఎంతో మంది సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు ముందుకు వస్తుండటం అభినందనీయమని అన్నారు. ముఖ్యంగా మహిళలు కూడా క్లబ్‌లలో సభ్యులుగా పాల్గొని సేవలందించేందుకు ముందుకు రావడం విశేషమని అన్నారు. వంటిళ్లకే పరిమితం కాకుండా సేవా సంస్థల్లో పాల్గొని కీలక పాత్రను పోషిస్తుండటం హర్షించదగ్గ విషయమన్నారు. గౌరవ అతిథిగా పాల్గొన్న డిస్టెట్ గవర్నర్ రాజ్ కిశోర్ స్వయి మాట్లాడుతూ.. వాకర్స్ క్లబ్‌ల వంటి సేవా సంస్థల్లో చేరే ప్రతీ ఒక్కరిలో అంకిత భావం ఉండాలని పిలుపునిచ్చారు. క్లబ్‌ల ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలను నిర్వహంచాలని సూచించారు. ముందుగానే భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకుని అందుకు అనుగుణంగా కార్యరూపం దాల్చాలని అన్నారు. తాము నివసించే ప్రాంతాల్లో ఉండే పేదలకు ఆపన్న హస్తం అందించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం పట్టణానికి చెందిన వాకర్స్ క్లబ్ ప్రాంతీయ అధ్యక్షులు ఐ.గున్నేశ్వరరావు మాట్లాడుతూ.. మహిళలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండటం ఆనందించాల్సిన విషయమని అన్నారు. క్లబ్‌లు ఆర్థికంగా పుంజుకుంటే దానికి అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం ఉంటుందని.. ఆ దిశగా కృషి చేయాలని అన్నారు. అనంతరం సాయిప్రియ వాకర్స్ క్లబ్, సాయిప్రియ మహిళా వాకర్స్ క్లబ్‌ల నూతన కార్యవర్గ సభ్యులచే ప్రాంతీయ అధ్యక్షులు గొవింద గుప్తా ప్రమాణ స్వీకారం చేయించారు.
సాయిప్రియి వాకర్స్ క్లబ్ కార్యవర్గం ఇలా..
సాయిప్రియ వాకర్స్ క్లబ్ అధ్యక్షులుగా జయక్రిష్ణ ప్రధాన్, ఉపాధ్యక్షులుగా లాల మెహన్‌బెహర, విప్రచరణ్ బ్రహ్మ, కార్యదర్శిగా జగన్నాథనాయక్, సహకార్యదర్శిగా పొట్టాం సురేష్, కోశాధికారిగా కె.వైకుంఠరావు, జొలి వాకర్‌గా ఎ.త్రినాథరావు, ధర్మరాజులు నియమితులయ్యారు. అలాగే సాయిప్రియ మహిళా వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలిగా పొట్టాం రమాదేవి, కార్యదర్శిగా జి.మాధురి, కోశాధికారిగా నిర్మల పట్నాయక్, ఉపాధ్యక్షురాలుగా జి.స్వప్న, సహకార్యదర్శిగా కె.అరుణశ్రీ, సహకోశాధికారిగా జి.సుభాషిణి, జొలివాకర్‌గా కె.సునిత, కె.రజిని, ప్రోకోఆర్డినేటర్‌లుగా పి.దీప, జామి పూర్ణిమ, కె.అరుణ శేఖర్, సలహాదారులుగా పి.సురేష్, లాడి చంద్ర మౌళి, బొర్డాప్ డైరెక్టర్లుగా కె.అలేఖ్య, ఐ.లక్ష్మి, ఎ.సుశీల, కకే అశ్విని, కె.ఆరుణ, ఎల్.లతలు నియమితులయ్యారు. కొలువు దీరిన కొత్త కార్యవర్గానికి సభ్యులు అభినందించారు. కార్యక్రమంలో సత్యవాది పతి, డాక్టర్ సురేష్ కుమార్, సుభాష్ బెహర పాల్గొన్నారు.


