ఒకే విడతలో రుణాలు వసూలు
● సహకార బ్యాంక్ నిర్ణయం
జయపురం: రుణం తీసుకొని దీర్ఘకాలంగా పెండింగులో ఉన్నవారి నుంచి ఏకకాలంలో తిరిగి వసూలు చేయాలని జయపురం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ప్రతినిధులు నిర్ణయించారు. బ్యాంక్ 82వ సాధారణ సమావేశం బుధవారం జరిగింది. సమావేశానికి బ్యాంక్ పరిశీలన కమిటీ అధ్యక్షులు సుకాంత త్రిపాఠీ అధ్యక్షత వహించారు. ధీర్ఘకాల రుణాల వసూలుపై చర్చించారు. రుణగ్రస్తుల నుంచి ధీర్ఘకాల రుణాలను ఏకకాలంలో (ఒకే విడత) వసూలు చేయాలని సమావేశంలో ప్రవేశ పెట్టిన తీర్మాణాన్ని సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. అలాగే ఇంగ్లిష్‌లో ఉన్న బ్యాంక్ లోగోను ఒడియాలోకి మార్చాలని తీర్మాణం చేశారు. బ్యాంక్ ఉద్యోగుల వేతనం 35 శాతం పెంచాలని, జయపురం పట్టణంలో బ్యాంక్ శాఖ ప్రారంభించాలని ప్రతిపాదించారు. గత సమావేశంలో ప్రతిపాదనల అమలుపై చర్చి్‌ంచారు. బ్యాంక్ ఆదాయ వ్యయాలు, రానున్న ఆర్థిక సంవత్సర బడ్జెట్, మొదలగు విషయాలపై చర్చించారు. సమావేశంలో బ్యాంక్ కార్యదర్శి విజయ, డైరెక్టర్ దేవేంద్ర బాహిణీపతి, ఉభాష్ సాహు, లక్ష్మణరావు, పి.పద్మారెడ్డి, దేబొ చౌదరి, సునీల్ పట్నాయక్ పాల్గొన్నారు.


