దోకొంధా గ్రామంలో ప్రజారోగ్య బృందం సందర్శన
భువనేశ్వర్: పూరీ జిల్లా దోకొంధా ప్రాంతంలో ప్రజారోగ్య శాఖ ప్రత్యేక బృందం పరిశీలన ప్రారంభమైంది. ఈ ప్రాంతంలో ఇటీవల పచ్చ కామెర్లు వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. క్షేత్ర స్థాయిలో కామెర్ల వ్యాప్తికి కారణం, తాజా పరిస్థితులు సమీక్షించేందుకు ఈ బృందం పర్యవేక్షిస్తోంది. ఈ సందర్భంగా పచ్చ కామెర్లు బాధితుల కుటుంబాలతో మాట్లాడి, గ్రామాన్ని సందర్శించి పరిసరాలు పరిశీలించారు. ఈ ప్రాంతంలో ప్రజలు స్థానిక దయా నది నీటిపై ఆధారపడతారు. ఈ నది నీరు కలుషితమై కామెర్లు వ్యాప్తించినట్లు భావిస్తున్నారు. ప్రజారోగ్య బృందం ఈ నది నీరు నమూనాల్ని సేకరించింది. తదుపరి పరీక్షల కోసం సిఫారసు చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు దయా నది నీటి వినియోగం నివారించాలని సూచించారు.


