బీజేపీ నాయకుడు గంగాధర్ సామంత్రాయ్ మృతి
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లాకి చెందిన అధికార బీజేపీ సీనియర్ నాయకుడు గంగాధర్ సామంత్రాయ్ (67) మృతి చెందారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రాజు వీధిలోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. గంగాధర్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. మరణ వార్త విన్న వెంటనే రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖా మంత్రి నిత్యానంద గొండో, నబరంగ్‌పూర్ ఎంపీ, ఎమ్మెల్యే లు బలబద్ర మజ్జి, గౌరీ శంకర్ మజ్జిలు హుటాహుటీన చేరుకొని సామంత్రాయ్ మృతదేహానికి నివాళులర్పించారు. గంగాధార్ నబరంగ్‌పూర్ జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా 2000–09 వరకు పని చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షునిగా, అనేక రాష్ట్ర పదవులలో కొనసాగారు. అంతిమ యాత్రలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కను దాస్, మాజీ ఎంపీ పరశురాం మజ్జి, బీజేపీ నాయకులు జడేశ్వర్ ఖడంగా, రాజ పురోహితుడు నర్సింగ త్రిపాఠి పాల్గొన్నారు.
బీజేపీ నాయకుడు గంగాధర్ సామంత్రాయ్ మృతి


