రహగిరి ఉత్సవాలు
వైభవంగా..
పర్లాకిమిడి: గజపతి ఉత్సవాలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభోత్సవం సందర్భంగా పర్లాకిమిడి పురపాలక సంఘం ఆధ్వర్యంలో రాజవీధిలో కిలో మీటరు మేర రహగిరి పదోత్సవాలను అదనపు కలెక్టర్ మునీంద్ర హనగ ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి మాట్లాడుతూ.. పర్లాకిమిడి తెలుగు, ఒడియా సంప్రదాయ కళాకారుల సమ్మేళనమని అన్నారు. జిల్లా వ్యాప్తంగా కళాకారులను ప్రోత్సాహించడమే ఈ రహగిరి పదోత్సవాలు ఉద్దేశమని పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి అన్నారు. ఒడిస్సీ, కూచిపూడి కళాకారులు నృత్యాలు ప్రదర్శించారు. గిరిజన సంప్రదాయ సవర నృత్యం, యోగా, స్కేటింగ్, మహిళా స్వయం సహాయక గ్రూపుల స్టాల్స్, రంగవల్లుల పోటీలు, కృష్ణచంద్ర సమర యోధుల కత్తి, కర్ర సాములు ప్రదర్శించి అధికారుల మన్ననలను పొందారు. ఈ రహగిరి ఉత్సవాల్లో సబ్ కలెక్టర్ అనుప్ పండా, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్, తబలా కళాకారులు రఘునాథ పాత్రో, తదితరులు పాల్గొని కళాకారులను ఉత్సాహ పరిచారు.
రహగిరి ఉత్సవాలు
రహగిరి ఉత్సవాలు
రహగిరి ఉత్సవాలు
రహగిరి ఉత్సవాలు


