పర్లాకిమిడిలో హిందూ సమ్మేళనం
పర్లాకిమిడి: రాష్ట్రీయ స్వయం సహాయక్ సంఘ్ ఏర్పడి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్ద ఎత్తున హిందూ ఐక్యత వాదులు ఒక్కటయ్యారు. గజపతి జిల్లాలో హిందువుల ఐక్యత, జాగృతి కోసం పర్లాకిమిడి ఫారెస్టు గేటు వద్ద ‘హిందూ సమ్మేళనం’ విశ్వహిందూ పరిషద్, ఆర్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం హిందూ సమ్మేళనం జరిగింది. ఈ సభకు వి.హెచ్.పి నాయకులు ప్రియా చరణ్ మహారాజ్, సౌమ్యరంజన్ ఆచార్య, నృసింహా చరణ్ దాస్, దుర్గా మాధవ్ పాణిగ్రాహి, జి.కూర్మారెడ్డి, వి.హెచ్.పి పట్టణ అధ్యక్షుడు కై లాస్ పట్నాయక్, సరోజ్ పండా తదితరులు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో, దేశంలో గోవధ నిషేధించాలని, మతమార్పిడిలు జిల్లాలో నిర్మూలించాలని మహాంత ప్రియాచరణ్ మహారాజ్ అన్నారు. దీని కోసం గిరిజన సంప్రదాయ హిందువులు అంతా ఐక్యంగా పోరాడాలన్నారు. ఈ హిందూ సమ్మేళనంలో గజపతి సవర సమాజ్ (ఆర్.ఉదయగిరి) నాయకులు, జిల్లాలో పలు గ్రామాల నుంచి వచ్చిన వందలాది మంది పాల్గొన్నారు.
పర్లాకిమిడిలో హిందూ సమ్మేళనం
పర్లాకిమిడిలో హిందూ సమ్మేళనం


