ఆదివాసీ నాయకుల పర్యటన
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి రఖాల్‌గూడ గ్రామంలో రాష్ట్ర స్థాయి ఆదివాసీ సమాజ మహా సంఘం నాయకులు ఆదివారం పర్యటించారు. గ్రామంలో లకే పోడియమి హత్య ఘటనా కేంద్రంగా చేసుకొని జిల్లాలో గత నెల 5వ తేదీ నుంచి ఏర్పడిన వివాదానికి పరిష్కారం చూపించి, శాంతియుత వాతావరాణాన్ని పునరుద్ధరించేందుకు రాష్ట్రస్థాయి ఆదివాసీ అధ్యక్షుడు కర్మాలక్రా స్వయంగా వెళ్లి గ్రామంలోని ఆదివాసీలతో చర్చించారు. జరిగిన ఘటనలో లకే పోడియమి హత్యతో కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందజేయాలన్నారు. దోషులను కఠినంగా శిక్ష విధించాలని, రెండు గ్రామాల మధ్య ఏర్పడిన వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించాలన్నారు. ఎం.వి 26 గ్రామాన్ని కూడా పరిశీలించారు. ఎస్పీ వినోద్ పటేల్‌ను కలిసి దోషులను త్వరాగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ పర్యటనలో రాష్ట్ర ఆదివాసీ కార్యదర్శి శరత్ చంద్రనాయక్, సాధారణ కర్యదర్శి మనోజ్ కుమార్ ప్రదాన్, మయూరభంజ్ ఆదివాసీ సంఘ అధ్యక్షుడు రవేంద్రనాథ్ సింగ్, మల్కన్‌గిరి ఆదివాసీ సంఘ అధ్యక్షుడు బంధు ముదులి, ఇతర ఆదివాసీ నేతలు పాల్గొన్నారు.


