● కాంగ్రెస్ ధర్నా
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అఖిల భారతీయ కాంగ్రెస్ కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భక్తచరణ్ దాస్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ కార్యాలయం వద్ద జిల్లా పార్టీ అధ్యక్షుడు జి.శ్రీనివాసురావు నాయకత్వంలో మనరేగా బచావో ఉద్యమ లక్ష్యం కోసం ఆదివారం ధర్నా నిర్వహించారు. ముందుగా మహాత్మాగాంధీ చిత్రపటానికి నిళులర్పించి మౌనపోరటం ప్రారంభించారు. నిరాహారదీక్షను చేపట్టారు. జిల్లా పార్టీ నాయకులు జి.శ్రీనివాసురావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గాంధీని అవమానిస్తుందన్నారు. ఆయన పేరున ఉన్న మనరేగా పథకం నుమార్చి జీవీ రామ్‌జీ పేరు పెట్టడం తగదన్నారు. గాంధీజీకి జరిగిన ఈ అవమానాన్ని దేశం సహించదన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు జిల్లా మొత్తం నిరసనలు చేపట్టాన్నారు.


