పర్లాకిమిడి చేరిన ‘స్వర్ణ ధనుష్ యాత్ర’
పర్లాకిమిడి: అయోధ్యలోని శ్రీబాలరామునికి అలంకరించడానికి తయారు చేసిన స్వర్ణ ధనుష్‌ను రూపొందించారు. దీన్ని రూర్కెలా నుంచి సంబల్‌పూర్, భౌధ్, బరఘడ్, నువాపడ, నవరంగ్‌పూర్, కోరాపుట్ మీదుగా పర్లాకిమిడికి ప్రత్యేక రథంలో శనివారం తీసుకొచ్చారు. దీనిని సరస్వతీ శిశు మందిర్ నుంచి పట్టణంలో జైత్ర యాత్ర చేసి బరంపురం వైపు వెళ్లిపోయింది. ఈ యాత్రలో విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకులు కై లాస్ చంద్ర పట్నాయక్, లోకనాథ మిశ్రా, భజరంగ్ దళ్ నాయకులు మనోజ్ దాస్ తదితరులు మోటారు సైకిళ్ల ర్యాలీలో పాల్గొన్నారు.
రాయగడలో స్వర్ణ ధనుస్సు రథం
రాయగడ: అయోధ్యలో ప్రతిష్టించిన బాలరాముడి స్వర్ణ ధనుస్సు శనివారం రాత్రి రాయగడకు చేరుకుంది. స్థానిక సిరిగుడ కూడలి నుంచి శ్రీరామ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై రథానికి మంగళహారతులు సమర్పించి ఘనంగా స్వాగతం పలికారు. ధనుస్సుతో గల రథాన్ని తాకేందుకు భక్తులు పోటీపడ్డారు. అయితే ఒకొక్కరికీ అవకాశం కల్పించారు. ఎంతో భాగ్యం చేసుకోవడంతోనే బాలరాముడి స్వర్ణ ధనుస్సు తాకే ఆవకాశం లభించిందని భక్తి పారవశ్యంతో భక్తులు జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో భజరంగ్‌దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం కపిలాస్ కూడలి మీదుగా పూరీకి రథం పయనమయ్యింది.
మల్కన్‌గిరిలో..
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా శ్రీరామ స్వర్ణ ధనుస్సు రథం వచ్చింది. స్థానిక హన్‌మాన్ విగ్రహం వద్ద రథానికి భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. రౌర్కెలా నుంచి పలు జిల్లాలు దాటుతూ మల్కన్‌గిరి మీదగా భద్రచలం వెళ్లి అక్కడ నుంచి అయోధ్యకు రథం చేరుకుంటుంది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
పర్లాకిమిడి చేరిన ‘స్వర్ణ ధనుష్ యాత్ర’
పర్లాకిమిడి చేరిన ‘స్వర్ణ ధనుష్ యాత్ర’
పర్లాకిమిడి చేరిన ‘స్వర్ణ ధనుష్ యాత్ర’


