ప్రపుల్ల పండాకు జాతీయ స్థాయి అవార్డు ప్రదానం | - | Sakshi
Sakshi News home page

ప్రపుల్ల పండాకు జాతీయ స్థాయి అవార్డు ప్రదానం

Jan 11 2026 7:07 AM | Updated on Jan 11 2026 7:07 AM

ప్రపు

ప్రపుల్ల పండాకు జాతీయ స్థాయి అవార్డు ప్రదానం

పర్లాకిమిడి: సెంచూరియన్‌ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఇంజినీరింగ్‌ స్కూల్‌ డీన్‌, ప్రొఫెసర్‌ ప్రపుల్ల పండాకు జాతీయ స్థాయి ‘స్పూర్తిదాయక పౌర పురస్కారం’ను భువనేశ్వర్‌లోని ప్రెస్‌ క్లబ్‌లో అధికారులు అందజేశారు. ప్రపుల్ల పండా భువనేశ్వర్‌లో జరిగిన ‘రీషేపింగ్‌ గ్రీనర్‌ ఫ్యూచర్‌’ జాతీయ స్థాయి సెమినార్‌లో రిమోట్‌ సర్విసింగ్‌, జియె గ్రాఫిక్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ సిస్టం (జి.ఐ.ఎస్‌.), ప్రకృతి విపత్తులపై పేపర్‌ ప్రెజెంటేషన్‌కు ఈ అవార్డు లభించింది. జి.ఐ.ఎస్‌పై చేసిన పరిశోధనకు ప్రపుల్ల పండాకు అవార్డు లభించడం పట్ల సెంచూరియన్‌ వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య డి.ఎన్‌.రావు, రిజిస్ట్రార్‌ అనితా పాత్రో, డైరెక్టర్‌ దుర్గాప్రసాద్‌ పాడీ, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.

జిల్లాస్థాయి చోళ్ల మండీ ప్రారంభం

జయపురం: జయపురం సబ్‌డివిజన్‌ బొయిపరిగుడ సమితి హటపొడ లో మండియ(చోళ్లు అమ్మే కేంద్రం) మండీని కొరాపుట్‌ కలెక్టర్‌ మనోజ్‌ సత్యబాన్‌ మహజన్‌ శనివారం ప్రారంభించారు. ఒడిశా కృషి, కృషక పరిచాలన విభాగం ద్వారా నియమించిన సబుజిమా ఉత్పాధన కంపెనీ ద్వారా ఏర్పాటు చేసిన మండియ కొనుగోలు కేంద్రం మండీ ప్రారంభ కార్యక్రమానికి సబుజిమా ఉత్పాదన కంపెనీ అధ్యక్షుడు మొణీ మఝీ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కొరాపుట్‌ కలెక్టర్‌ మనోజ్‌ సత్యబాన్‌ మహాజన్‌ రబ్బర్‌ కట్‌ చేసి మండీని ప్రారంభించారు. గౌరవ అతిథులుగా బొయిపరిగుడ సమితి అధ్యక్షుడు ప్రశాంత కుమార గుప్త, ఉపాధ్యక్షురాలు పూర్ణియ బారిక్‌, బీడీఓ సుబ్రత సాహు, జిల్లా పరిషత్‌ సభ్యులు మణీ జానీ, నవరంగపూర్‌ నాయకుడు నరేంధ్ర కందలియ, కొట్‌పాడ్‌ ఎం.ఎల్‌.ఎసి.హెచ్‌.ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు.

మహిళ మెడలో మంగళసూత్రం చోరీ

రాయగడ: మహిళపై దాడి చేసి ఆమె మెడలోని మంగళసూత్రాన్ని గుర్తుతెలియని దుండగులు తష్కరించిన ఘటన స్థానిక రైల్వే కాలనీలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. రైల్వే విభాగంలో ఎలక్ట్రికల్‌ టెక్నిషియన్‌గా ఆర్‌.నాగమణి పనిచేస్తోంది. తెల్లవారి జామున మూత్ర విసర్జనకు వాస్‌ రూమ్‌కు వెళ్లింది. అప్పటికే అక్కడ ఉన్న ఇద్దరు గుర్తుతెలియని దుండగులు ఆమైపె దాడి చేసి తులంనర బంగారు మంగళసూత్రాన్ని తస్కరించారు. ఆమె కేకలు వేయగా ఇరుగుపొరుగు వారు లేచి వచ్చేసరికి దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. గాయపడిన నాగమణిని కాలనీ వాసులు సమీపంలో గల రైల్వే ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి చికిత్స చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైల్వే, సదరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దుండగుల ఆచూకీ గురించి ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న రాయగడ డీఆర్‌ఎం అమితాబ్‌ సింఘల్‌ బాధితురాలి క్వార్టర్‌కు చేరుకుని వివరాలు సేకరించి పరామర్శించారు.

ప్రపుల్ల పండాకు జాతీయ స్థాయి అవార్డు ప్రదానం 1
1/2

ప్రపుల్ల పండాకు జాతీయ స్థాయి అవార్డు ప్రదానం

ప్రపుల్ల పండాకు జాతీయ స్థాయి అవార్డు ప్రదానం 2
2/2

ప్రపుల్ల పండాకు జాతీయ స్థాయి అవార్డు ప్రదానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement