ఉత్సాహంగా సైన్స్ కళాశాల వార్షికోత్సవం
పర్లాకిమిడి: గుమ్మ బ్లాక్ పర్సంబ గ్రామంలోని బినోదినీ ప్లస్‌టు సైన్సు కళాశాలలో శనివారం మధ్యాహ్నం 28వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యఅతిథిగా పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి విచ్చేసి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఇతర అతిథులుగా గుమ్మ సమితి అధ్యక్షురాలు సునేమీ మండళ్, సబ్ కలెక్టర్, కళాశాల అధ్యక్షులు అనుప్ పండా, ఉపాధ్యక్షులు ఎస్.శ్రీనివాసరావు, జీబ పంచాయతీ సర్పంచ్ ఎడంగా శోబోరో తదితరులు విచ్చేశారు. గిరిజన ప్రాంతంలోని విద్యార్థులకు అందుబాటులో ఉండే ఈ ప్లస్ టు కళాశాలలో విద్యార్థులకు ఆడిటోరియం నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి హామీ ఇచ్చారు. అనంతరం సీని గాయనీ డాక్టర్ అనురాధా పాణిగ్రాహి తన గాత్రంతో విద్యార్థులకు తన్మయపరిచింది. క్రికెట్, ఇతర ఆథ్లెటిక్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్యఅతిథి రూపేష్‌పాణిగ్రాహి బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. కళాశాల అధ్యాపకులు రవీంద్ర పాణిగ్రాహి అతిథులకు ధన్యవాదాలు తెలిపారు.
భువనేశ్వర్: స్థానిక కళింగ స్టూడియో స్క్వేర్ వద్ద శనివారం ఉదయం అమొ బస్సులో మంటలు చెలరేగాయి. ప్రయాణికులతో వెళుతుండగా బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుందని భావిస్తున్నారు. ఈ సంఘటనలో ప్రయాణికులకు ఎలాంటి హాని జరగలేదని సమాచారం. సంఘటనా స్థలానికి తక్షణమే చేరుకున్న భరత్‌పూర్ ఠాణా పోలీసులు ప్రయాణికులందరినీ రక్షించారు. అగ్ని మాపక సిబ్బంది సకాలంలో మంటలను నివారించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
పర్లాకిమిడి: గుసాని సమితిలో శనివారం మహేంద్రతనయ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గజపతి ఉత్సవాలు సందర్భంగా.. సమితి స్థాయిలో ఉత్సవాల ముగింపు సందర్భంగా ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్తు అదనపు ఈఓ పృథ్వీరాజ్ మండల్ విచ్చేశారు. గుసాని సమితి చైర్మన్ నాగులపల్లి వీర్రాజు, వైస్ చైర్మన్ ఎస్.అనసూయాదేవి, తదితరులు పాల్గొన్నారు. కళాకారులకుబహుమతులు అందజేశారు.
ఉత్సాహంగా సైన్స్ కళాశాల వార్షికోత్సవం
ఉత్సాహంగా సైన్స్ కళాశాల వార్షికోత్సవం


