పీఎంశ్రీ ఉత్సవాలు ప్రారంభం
పర్లాకిమిడి: మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉన్నత చదువులే లక్ష్యంగా ముందుకు అడుగులు వేయాలని, మీకు బాసటగా ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ కూడా సహకారం అందిస్తుందని మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో అన్నారు. గుసాని సమితి హాత్తిబడి వద్ద 500 సీట్ల పోస్టు మెట్రిక్ మైనార్టీ హోస్టల్‌లో పి.ఎం.శ్రీ ఉత్సవాలను పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో ప్రారంభించారు. జిల్లా పరిషత్తు అదనపు కార్యనిర్వాహణ అధికారి పృథ్వీరాజ్ మండల్, జిల్లా పరిశ్రమల శాఖ, జనరల్ మ్యానేజరు సునారాం సింగ్, డీఈఓ డాక్టర్ మయాధార్ సాహు, ఒడిషా విద్యాలయాల పాఠ్యాంశాల సంస్కరణకర్త అధ్యక్షులు నిత్యాంద ప్రదాన్, జిల్లా ఎంప్లాయిమెంట్, స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి సౌభాగ్య స్మృతిరంజన్ త్రిపాఠి, సమగ్ర గిరిజనాభివృద్ధి శాఖ అధికారి అంశుమాన్ మహాపాత్రో, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సల్మాన్ రైకా, అదనపు డీఈఓ ఎస్.గిరిధర్ పాల్గొన్నారు.
పీఎంశ్రీ ఉత్సవాలు ప్రారంభం
పీఎంశ్రీ ఉత్సవాలు ప్రారంభం


