మేకలు, గొర్రెలు, కోళ్లకు గిరాకీ
పర్లాకిమిడి:
సంక్రాంతి సమీపిస్తుండంతో సంతలో మేకలు, గొర్రెలు, కోళ్లకు గిరాకీ ఏర్పడింది. పర్లాకిమిడిలోని శనివారం వారపు సంతలో లక్షలాది రూపాయల లావేదేవీలు జరిగాయి. కుండలు, రైతులు ధాన్యరాసులు నిల్వ ఉంచేందుకు వివిధ బుట్టలు, గాదెలు, వనరాజా కోళ్లు, కాయగూరలు, మేకలు, గొర్రెలు అధిక రేట్లకు అమ్ముడుపోయాయి. అన్నింటికంటే కనుమ జరుపుకునే మాంసాహారం విందువినోదాలకు కోడి పుంజులు ఒక్కొక్కటి రూ.1200 పలికాయి. కోడి పెట్టలు జత వెయ్యి రూపాయలు పలికాయి. మేకలు, గొర్రెలు ఉదయం పది గంటలకే బేరాలు కుదిరి అమ్మకాలు జరిగిపోయాయి.
మేకలు, గొర్రెలు, కోళ్లకు గిరాకీ
మేకలు, గొర్రెలు, కోళ్లకు గిరాకీ


