యువకుడి దారుణ హత్య
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి అంబొదల పోలీస్‌స్టేషన్ పరిధి బొడొనాగజరి గ్రామంలో బొడొనున్నా కరిమ్ (23) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య కేసుకు సంబంధించి గ్రామానికి చెందిన బిసంబర్ కరిమ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన బొడొనున్నా కరిమ్ తన సొంత పొంలంలో పనులు చేసేందుకు వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన బిసంబర్ పొలం వద్దకు వెళ్లి గొడ్డలితో
బొడొనున్నాపై ఒక్కసారిగా దాడి చేశాడు. తీవ్రగాయాలకు గురైన బొడొనున్న సంఘటన స్థలం వద్దే మృతి చెందాడు. బొడొనున్నా, బిసంబరులు పెద్దనాన్న, చిన్నాన్నల పిల్లలు. వారి మధ్య కొన్నాళ్లుగా కుటుంబ గొడవలు జరుగుతున్నాయని, పాత కక్షలే హత్యకు కారణమని భావిస్తున్నారు.


