విస్తృతంగా ఎకై ్సజ్ దాడులు
రాయగడ: జిల్లా అబ్కారీ శాఖ సిబ్బంది గత రెండు రోజులుగా వివిధ ప్రాంతాల్లో దాడులను విసు్తృతంగా నిర్వహించారు. జేకేపూర్, రాయగడ, పిరుడి కాలనీ, కుంభికొట, బెజాప, ఖటగుంత, కళ్యాణసింగుపూర్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో 227 లీటర్ల నాటుసారా, 235 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 11 మందిపై కేసులు నమోదు చేసి కోర్టుకు తరలించారు. దాడుల్లో ఆరు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. రాయగడ అబ్కారీ శాఖ ఐఐసీ సత్యనారాయణ దాస్ ఆధ్వర్యంలో మోబైల్ బృందం దాడుల్లో పాల్గొన్నారు.


