భద్రక్ ప్రాంతంలో పాఠశాల వేళలు మార్పు
భువనేశ్వర్: రాష్ట్రంలో అత్యధిక ప్రాంతాల్లో చలి గజగజలాడిస్తుంది. ఈ నేపథ్యంలో భద్రక్‌లోని ప్రభుత్వ పాఠశాల సమయాల్లో మార్పు చేశారు. జిల్లా యంత్రాంగం తాజా నిర్ణయం ప్రకారం నిత్యం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాఠశాలలు పని వేళలుగా ప్రకటించారు. శని వారం నుంచి ఈ ఉత్తర్వులు అమలు కానున్నాయి. తీవ్రమైన చలి, పొగమంచు కారణంగా జిల్లా యంత్రాంగం ఈ మేరకు నిర్ణయించింది. ఫిబ్రవరి నెల 2వ వారం వరకు నిరవధికంగా ఈ నిర్ణయం కొనసాగుతుంది. 1 నుంచి 10వ తరగతి వరకు పాఠశాల సమయాల్లో మార్పు వర్తిస్తుంది.
రాయగడ: స్థానిక గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో ఈనెల 26వ తేదీన నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవానికి సంబంధించి కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అధ్యక్షతన సన్నాహక సమావేశం శుక్రవారం నిర్వహించా రు. జిల్లా పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరక్టర్ బసంత కుమార్ ప్రధాన్ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి వివరాల నివేదికను చది వి వినిపించారు. ఇదిలా ఉండగా స్థానిక ఫ్‌లై ఓవర్ బ్రిడ్జి మరమ్మతుల పనుల కారణంగా ఈసారి పాఠశాల, కళాశాలలకు చెందిన విద్యార్థులతో ర్యాలీ చేపట్టవద్దని కలెక్టర్ ఆదేశించారు.
శ్రీకాకుళం రూరల్: బైరి ఇసుక ర్యాంపుపై శుక్రవారం రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. వంశధార నదిలో అనధికారికంగా సాగుతున్న ఇసుక రవాణాను అడ్డుకున్నారు. ర్యాంపు నడిచే ప్రాంతాల్లో ఎక్కడికక్కడ గట్లకు అడ్డుకట్ట వేస్తూ స్ట్రెంచ్ కొట్టించారు.
సారవకోట : మండల కేంద్రం సారవకోటకు చెందిన బీఎస్‌ఎఫ్ జవాన్ పారశెల్లి ధర్మేంద్రబాబు(53) గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. శుక్రవారం ఆయన మృతదేహానికి పాత పట్నంలో పోస్టుమార్టం నిర్వహించగా స్థానిక యువకులు ద్విచక్ర వాహనాలతో గ్రామంలో ర్యాలీగా తీసుకొచ్చారు. కుర్ధాకు చెందిన 110 బెటాలియన్ బీఎస్‌ఎఫ్ సైనికులు ఎస్‌ఐ నారాయణమూర్తి ఆధ్వర్యంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ధర్మేంద్రబా బు డిసెంబర్ 28న సెలవుపై వచ్చారు. ప్రస్తు తం 18 బెటాలియన్ నార్త్ బెంగాల్‌లో విధులు నిర్వర్తించారు. ఈయనకు భార్య దేవి, కుమారుడు ఉన్నాడు.
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన అంతర్జాతీయ పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సతివాడ హిమశేఖర్‌కు అంబేద్కర్ ప్రోగ్రెసివ్ ట్రస్ట్ చైర్మన్ కొండ్రు జగదీశ్వరరావు రూ.20 వేలు ఆర్థిక సాయం శుక్రవారం అందజేశారు. శ్రీకాకుళం గూనపాలెంకు చెందిన హిమశేఖర్ ఈజిప్ట్ దేశం కై రో నగరం వేదికగా ఈ నెల 13 నుంచి 18 వరకు జరగనున్న పారా వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్–2025–26 పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా జగదీశ్వరరావు మాట్లాడుతూ నిరుపేద క్రీడాకారుల కు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. దే శం తరఫున ప్రాతినిధ్యం వహించి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ అంపిలి ప్రేమ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
వజ్రపుకొత్తూరు రూరల్ : పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని రైల్వే ఎల్‌సీ గేట్‌ను శుక్రవారం టాటామ్యాజిక్ వ్యాన్ ఢీకొట్టింది. గేటు విరిగిపోవడంతో సుమారు గంట సేపు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. గేట్ కీపర్ విషయాన్ని రైల్వే స్టేషన్ మేనేజర్ కుమార్‌దాస్‌కు తెలియజేయడంతో రైల్వే ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని తాత్కాలిక గేటు ఏర్పాటు చేశారు. ఆర్పీఎఫ్ పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంతో వాహనాల రాకపోకలు కొనసాగాయి. ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్‌పై ఆర్పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వాహనాన్ని స్వాధీనం చేసుకొని రైల్వే పోలీసుస్టేషన్‌కు తరలించారు.
పేకాట శిబిరంపై దాడి
రణస్థలం: తెప్పలవలస పంచాయతీ సీతారాంపురం సమీపంలోని తోటల్లో పేకాట శిబిరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఏడుగురిని అదుపులోనికి తీసుకుని పోలీసులకు అప్పగించారు. వీరి వద్ద నుంచి ఏడు సెల్‌ఫోన్లు, రూ.1,95,960 నగదు స్వాధీ నం చేసుకున్నట్లు జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
భద్రక్ ప్రాంతంలో పాఠశాల వేళలు మార్పు


