రాయగడలో సంక్రాంతి సంబరాలు
రాయగడ: రాయగడలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. స్థానిక రైతుల కాలనీలోని జెమ్స్ విద్యా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జెమ్స్ ప్రాంగణంలో మహిళల మధ్య ముగ్గుల పోటీలను నిర్వహించింది. సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ఈ పోటీల్లో 45 మంది మహిళలు ఆసక్తిగా పాల్గొన్నారు. సంక్రాంతి పండుగను తలపించే విధంగా అతివలు వేసిన రంగవల్లికలు అందరినీ ఆకర్షించాయి. ప్రతీ ఏడాది ఇటువంటి తరహా పోటీలను తమ విద్యా సంస్థ నిర్వహిస్తుందని డైరెక్టర్ తుబాటి రాము తెలిపారు. ఇదిలాఉండగా పోటీల్లొ పి.దీపిక ప్రథమ బహుమతిని గెలుచుకోగా ద్వితీయ బహుమతిని భాగ్య లక్ష్మీ దాస్, తృతీయ బహుమతిని సంతోషి గంతాయిత్‌లు గెలుచుకున్నారు. భాషాతీతంగా ఈ పోటీల్లొ ఒడియా మహిళలు కూడా పాల్గొనడం విశేషం. విజేతలకు బహుమతులను అందజేశారు. పోటీలకు న్యాయనిర్ణేతలుగా రజిత కొరాడ హాజరయ్యారు. జెమ్స్ విద్యాసంస్థ ప్రిన్సిపాల్ పతివాడ వణిత పర్యవేక్షణలో పోటీలు జరిగాయి.
ఆకట్టుకున్న రంగవల్లికలు
రాయగడలో సంక్రాంతి సంబరాలు
రాయగడలో సంక్రాంతి సంబరాలు


