వర్క్‌షాప్ నిర్వహణ
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి కార్యాలయంలో గురువారం 2030 నాటికి గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా జిల్లా ప్రణాళిక, పర్యవేక్షణ యూనిట్, మల్కన్‌గిరి ఆధ్వర్యంలో సమితి స్థాయి వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ఈ వర్క్ షాప్ ద్వారా ప్రతి పంచాయతీ అభివృద్ధికి సుశక్తిమంతమైన, అభివృద్ధి చెందిన ఒడిశాగా నిర్మించవచ్చనే అనే అంశంపై వివిధ శిక్షణ కార్యక్రమాలు, ప్రెజెంటేషన్ల ద్వారా అవగహన కల్పించారు. 40కు పైగా విభాగాలకు చెందిన అధికారులు హాజరజయ్యారు. పంచాయతీ సమితి అభివృద్ధిశాఖ అధికారి అమూల్య కుమార్ సాహు, గోలక్ చంద్రదళాయి, సీనియర్ ఆర్థిక పరిశోధకుడు ధనపతి ఇంద్రజిత్, ప్రోగ్రాం మేనేజర్ రాజారాం మాలిక పాల్గొన్నారు.


