వేంకటేశ్వరునికి పొన్నాకుల హారతి
రాయగడ: ధనుర్మాస పూజల్లో స్థానిక బాలాజీ నగర్‌లో ఉన్న కల్యాణ వేంకటేశ్వర మందిరంలో ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు, రాంజీ ఆచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి పొన్నాకుల్లో హారతి సమర్పించారు. పొన్నాకుల హారతి వల్ల గాలిని శుద్ధి చేసి ప్రతికూల శక్తులను తొలగిస్తుందని, ప్రతీ ఏడాది ధనుర్మాసంలో ఇటువంటి తరహా పూజలను స్వామివారికి అర్పిస్తామని భాస్కరాచార్యులు పొన్నాకుల విశిష్టతను గురించి వివరించారు. కర్పూరం, పొన్నాకుల సువాసన కలిసి పవిత్రమైన, ప్రశాంతమైన వాతావరణం సృష్టించబడుతుందన్నారు. ముఖ్యంగా పొన్నాకుల్లో సహజ సిద్ధమైన సువాసన, పవిత్రత వల్ల హారతికి వాడడం వలన దీని ప్రభావం మరింత పెరుగుతుందన్నారు. పొన్నాకుల హారతి అనేది కేవలం ఒక సాంప్రదాయ పూజ మాత్రమే కాకుండా పర్యావరణాన్ని, మనస్సును శుద్ధి చేసి భక్తిని పెంచుతుందన్నారు.
వేంకటేశ్వరునికి పొన్నాకుల హారతి


