రేపటి నుంచి రాకపోకలు బంద్
రాయగడ: పాత రాయగడ, కొత్త రాయగడకు అనుసంధానం చేసే ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై శనివారం నుంచి రాకపోకలు నిలిపి వేయనున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఫ్లై ఓవర్ బ్రిడ్జి మరమ్మతుల పనులకు సంబంధించి బ్రిడ్జిపై వాహన రాకపోకలను నిలిపివేస్తున్నట్లు తెలియజేసింది. అయితే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రణను దృష్టిలో పెట్టుకుని దారి మళ్లించినట్లు వివరించారు. స్థానిక పీడబ్ల్యూడీ సిరిగుడ కూడలి నుంచి రైతుల కాలనీ మీదుగా సాయి ఇంటర్నేషనల్ కూడలి మీదుగా వాహన రాకపోకలు సాగించవచ్చని ప్రకటనలో పేర్కొంది. అదేవిధంగా ద్విచక్ర వాహనాలకు సంబంధించి మున్సిపాలిటీ రోడ్డు మీదుగా కపిలాస్ కూడలి నుండి రైల్వే అండ్ గ్రౌండ్ మీదుగా రాకపోకలు కొనసాగించవచ్చని వివరించింది. బ్రిడ్జి మరమ్మతుల పనులు పూర్తయ్యేంత వరకు బ్రిడ్జిపై రాకపోకలు కొనసాగవని స్పష్టం చేసింది.


