క్రీడలతో మానసిక ఉల్లాసం
రాయగడ: క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని జేకేపూర్‌లో గల జేకే పేపర్ మిల్ ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ వినయ్ ద్వివేది అన్నారు. గురువారం జేకేపేపర్ మిల్ మైదానంలో పేపర్ మిల్స్ యూనిట్ల మధ్య ఇంటర్ యూనిట్స్ లీగ్ క్రికెట్ టోర్నామెంట్ ప్రారంభమైంది. ఈ టోర్నీకి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన క్రీడాకారులను ప్రోత్సాహించారు. క్రీడలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ టోర్నీలో జేకేపేపర్ మిల్ (రాయగడ), పొన్‌ఘద్‌లో గల సెంట్రల్ పల్ప్ యూనిట్, సిరిపూర్ పేపర్ మిల్, కాగజ్‌నగర్ ఢిల్లీలకు చెందిన జట్ల మధ్య ఈ నెల 11 వ తేదీ వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. ప్రారంభోత్సవ అనంతరం సిరిపూర్ పేపర్ మిల్, జేకేపేపర్ మిల్స్ జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో జేకేపేపర్ మిల్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్ల పరిమితి గల ఈ మ్యాచ్‌లో జేకే పేపర్ మిల్ జట్టు 184 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన సిరపుర్ జట్టు 19.1 ఓవర్లలో 76 పరుగులకు అలౌట్ అయింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ను జేకేపేపర్ మిల్ జట్టుకు చెందిన మహమ్మద్ అభిషేష్‌కు దక్కింది.


