కాశీనగర్‌లో ఘనంగా వారణాసి ఉత్సవాలు
పర్లాకిమిడి: కాశీనగర్ ఎన్‌ఏసీలో గురువారం సాయంత్రం వారణాసి ఉత్సవాలు వారణాసి ప్రభుత్వ ఉన్నత పాఠశాల గ్రౌండ్స్‌లో ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలను పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ ఉత్సవాల్లో జిల్లా పరిషత్ అధ్యక్షులు గవర తిరుపతి రావు, కాశీనగర్ సమితి చైర్మన్ బల్లశాయమ్మ, వైస్ చైర్మన్ ఎస్.కళ్యాణి, కాశీనగర్ నగరపాలక మండలి చైర్మన్ మేడిబోయిన సుధారాణి, తహసీల్దార్ సుధీర్‌కుమార్ నోందో తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీడీఓ డంభుధర మల్లిక్ మట్లాడుతూ, కాశీనగర్ ఉత్సవాలు కళా, సంస్కృతికి నిదర్శనాలని అని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహికి ప్రత్యేక మెమొంటోను బీడీఓ డంబుధర మల్లిక్ అందజేశారు. అనంతరం పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆహుతులను ఆకట్టుకున్నారు.
కాశీనగర్‌లో ఘనంగా వారణాసి ఉత్సవాలు


