బంగ్లాదేశ్ చొరబాటుదారులను అడ్డుకోవాలి
రాయగడ: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో బంగ్లాదేశ్ చొరబాటుదారులు రోజురోజుకూ పెరిగిపోతున్నారని విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎస్పీ స్వాతి ఎస్.కుమార్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. రాయగడతో పాటు జేకేపూర్, గుణుపూర్, కళ్యాణ సింగుపూర్, రామనగుడ, మునిగుడ తదితర ప్రాంతాల్లో చొరబాటుదారుల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. చొరబాటుదారుల వల్ల భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని, తక్షణమే వారిని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భజరంగ్‌దళ్ జిల్లా కో ఆర్డినేటర్ శశ్యజ్యోతి బెహరా, పట్టణ కన్వీనర్ శంకర్ బెహరా, ప్రఫుల్ల పాత్రొ, ఆనందరావు తదితరులు ఉన్నారు.


