రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
రాయగడ: రోడ్డు ప్రమాదంలో యువకుడు తీవ్రగాయాలకు గురయ్యాడు. జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి పరిధిలోని కేశనాయకగుడ గ్రామ సమీపంలో మలుపు వద్ద బైకు అదుపుతప్పి కింద పడిపోవడంతో పర్శాలి పంచాయతీలోని చాటికొన గ్రామానికి చెందిన గొపినాథ్ భత్రియ గాయాలకు గురయ్యాడు. వ్యక్తిగత పనిపై బైకుతో వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయాలకు గురైన భత్రియాను కళ్యాణసింగుపూర్ పీహెచ్‌సీకి తరలించారు. అయితే పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు.


